ఫ్యూచర్ హీరోయిన్లతో అలా దొరికేసింది

Update: 2016-11-15 23:07 GMT
అలనాటి అందాల తార శ్రీదేవికి.. ఇప్పటికీ క్రేజ్ ఎక్కువే. బాలీవుడ్ బోలెడంత కాలం ఏలేసిన తర్వాత.. బాగా గ్యాప్ తీసుకుని రీ ఎంట్రీ ఇచ్చింది. ఏజ్ కు తగ్గ పాత్రలనే ఎంచుకుంటూ మళ్లీ పరుగులు పెట్టిద్దామని అనుకుంది కానీ.. అదంతా మొదటి సినిమాతోనే ఆగిపోయింది.

రీసెంట్ గా శ్రీదేవి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఎయిర్ పోర్టులో కనిపిచింది. అందరూ మోడ్రన్ డ్రస్సుల్లో భలేగా ఉన్నారులే. అమ్మ.. అక్కల కంటే.. చిన్న కూతురు ఖుషీ మరింతగా మెరిసిపోయింది. శ్రీదేవి ఇలా ఇద్దరు కూతుళ్లతో ఒకేసారి కనిపించడం.. చాలా అరుదుగా జరిగే విషయం. ఇప్పటికైతే ఈ అలనాటి అందాల తార లక్ష్యం.. కూతుళ్లిద్దరి కెరీర్ ని సరైన దిశగా నడిపించడమే.. సీనియర్ హీరోయిన్ గా శ్రీదేవి బాధ్యత. తన కెరీర్ పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉంది కానీ.. కూతుళ్లను దారిలో పెట్టేందుకు మాత్రం బాగానే స్కెచ్ లు వేస్తోంది శ్రీదేవి.

పెద్దకూతురు జాన్వి కపూర్ కి బాయ్ ఫ్రెండ్స్ విషయంలో కండిషన్స్ పెట్టేసింది. పెద్ద కూతురు సంగతే ఇంకా తేల్చలేదు కాబట్టి.. అంటే అరంగేట్రం పూర్తి చేయించలేదు కాబట్టి చిన్న కూతురు ఖుషీ కపూర్ సంగతి ఇఫ్పుడే చెప్పలేం. అందం.. అంతకు మించిన అభినయం ఉన్న శ్రీదేవికి.. తన కూతుళ్లను పర్ఫెక్ట్ గా కోరుకున్నట్లుగా లాంఛ్ చేయించేందుకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకావు. కానీ ఆ తర్వాత కంటిన్యూ చేయగలడమే ఇంకా ఎక్కువ ఇబ్బంది అనే సంగతి శ్రీదేవికి బాగానే తెలుసు. అందుకే ఇప్పటినుంచే బోలెడంత నూరిపోసేస్తోందట.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News