అనుకుంటాం కాని కొన్నిసార్లు సినిమాల్లో చూసినవి తారల జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. మణిరత్నం తీసిన ఘర్షణ సినిమా చూసారా. అందులో ఇద్దరు హీరోలు. ప్రభు - కార్తీక్. తండ్రి ఒకరే - తల్లులు వేరు. ఈ కారణంగా అన్నదమ్ములు నిప్పు ఉప్పులా ఉంటూ గొడవలు పడుతూ ఉంటారు. ఒకరంటే ఒకరికి పడదు అన్నంత ద్వేషాన్ని ఒళ్లంతా నింపుకుంటారు. చివరికి విలన్ వల్ల తండ్రి ప్రాణల మీదకు వచ్చినప్పుడు ఇద్దరు ఒకటవుతారు. ఇది ఆ సినిమా కథ. కాని నిజ జీవితంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్ అచ్చంగా ఇలాంటి తండ్రే.
శ్రీదేవి హటాన్మరణం తర్వాత అందరి దృష్టి బోనీ కపూర్ మొదటి భార్య సంతానం హీరో అర్జున్ కపూర్ వైపే మళ్ళింది. దీనికి కారణం అర్జున్ కపూర్ మొదటి నుంచి శ్రీదేవి పట్ల ఏర్పరుచుకున్న భావం. చాలా సార్లు ఇంటర్వ్యూలలో తన ప్రస్తావన వచ్చినప్పుడు సీరియస్ అయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అంతదాకా ఎందుకు శ్రీదేవి కూతుళ్ళు జాహ్నవి, ఖుషిలను తన చెల్లెళ్ళుగా ఒప్పుకోవడానికి కూడా అర్జున్ ఇష్టపడలేదు. అందుకే తన సినిమాల ప్రీమియర్లకు సైతం శ్రీదేవి ఫ్యామిలీ దూరంగా ఉండాల్సి వచ్చేది. శ్రీదేవి కూడా అర్జున్ ఫ్యామిలీతో కలిసి పోవాలని ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. బోని కపూర్ మొదటి భార్య చనిపోయినప్పుడు అర్జున్ కపూర్ శ్రీదేవిని పలకరించడానికి కూడా ఇష్టపడలేదు. అదంతా గతం.
అర్జున్ కపూర్ తన స్వరం మార్చాడు. శ్రీదేవి మీద తనకు చాలా గౌరవం ఉందని, తానొక సూపర్ స్టార్ అని, తన తండ్రి జీవితంలో ఉన్న వారు ఎవరైనా వారికీ తన గౌరవం తప్పకుండా ఉంటుందని స్పష్టం చేసాడు. వార్త తెలిసినప్పటి నుంచి చిన్నాన్న అనిల్ కపూర్ ఇంట్లో ఖుషిని ఓదార్చుతూ అక్కడే ఉన్న అర్జున్ బయట మాత్రం చాలా ముభావంగా కనిపించాడు. శ్రీదేవి పార్ధీవ దేహం ఇక్కడికి తీసుకొచ్చే విషయంలో తన తండ్రి ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకుని తనే స్వయంగా దుబాయ్ వెళ్లి అందరితో కలిసి వచ్చాడు. మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడని అర్జున్ కపూర్ మొత్తానికి శ్రీదేవి గురించి పాజిటివ్ గా మాట్లాడ్డంతో బోనీకి ఒక్క పెద్ద చిక్కు తగ్గినట్టే. ప్రస్తుతం అంత్యక్రియల్లో ఉన్న కపూర్ కుటుంబం అవి పూర్తయ్యాక ప్రత్యేక సంతాప కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.