శ్రీకాంత్ అడ్డాల ఇలా మారిపోయాడేంటి?

Update: 2023-07-04 20:00 GMT
శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడిలా మారిపోయాడేంటి? అన్న‌ది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్. క్లాస్ సినిమాలు చేసే అడ్డాల మాస్ కోణంలోకి  మారిపోవ‌డంతోనే ఈ డౌట్ రెయిజ్ అవుతోంది. ఇంత‌కాలం బంధాలు.. బాంధ‌వ్యాల నేప‌థ్యంలో సినిమాలు తీసిన అడ్డాల ఇప్పుడు రాంగోపాల్ వ‌ర్మ‌లా....బోయ‌పాటిలా క‌త్తి ప‌ట్టే క‌థ‌లు చేస్తున్నాడు. 'కొత్త బంగారు లోకం'..'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు'..' ముకుంద‌' .. 'బ్ర‌హ్మోత్స వం'  అన్నీ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్లే. అందులో రెండు సినిమాలు మిన‌హా మిగ‌తావన్నీ తెలుగు ప్రేక్ష‌కుల్ని ఎమోష‌న‌ల్ గా మెప్పించ‌న‌వే.

కానీ 'బ్ర‌హ్మోత్స‌వం' ప‌రాజ‌యంతో అడ్డాల వృత్తిగ‌త జీవితం కొత్త ట‌ర్నింగ్ తీసుకుంది.  ఆ సినిమా వైఫ‌ల్యం త‌ర్వాత కొత్త ఛాన్స్ రావ‌డానికి ఐద‌రాళ్లు ప‌ట్టింది. అంటే ఆ ప్లాప్ అడ్డాల‌పై ఎంత ప్ర‌భావం చూపిందో అద్దం ప‌డుతుంది.

అప్పుడే త‌మిళ సినిమాని  'నార‌ప్ప' గా రీమేక్ చేసి స‌క్సెస్ అందుకున్నాడు. అయినా  అడ్డాల‌కి అంత‌గా పేరు రాలేదు.  రీమేక్ సినిమా కావ‌డం..యాక్ష‌న్ స‌న్నివేశాలు..ఎమోష‌న్ ని ఒకేలా క్యారీ చేయ‌డంతో! మ‌క్కీకి మ‌క్కీ దించేసారు. ఇందులో అడ్డాల ప‌నిత‌నం ఏముంద‌ని?  కొత్త విమ‌ర్శ ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

ఆ త‌ర్వాత మ‌రో రెండేళ్లు గ్యాప్ త‌ప్ప‌లేదు. ఇందులో క‌రోనా సెల‌వులు కూడా వేయాలి. ప్ర‌స్తుతం 'పెద‌కాపు' అనే  ఓ భారీ యాక్ష‌న్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే టీజ‌ర్ కూడా  రిలీజ్ అయింది. టీజ‌ర్ ఆద్యంతం అడ్డాలలో  కొత్త కోణాన్ని ప‌రిచ‌యం చేస్తుంది.

ఓగ్రామ నేప‌థ్యంలో రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య తిరిగే క‌థ ఇది. ఈ క‌థ పూర్తిగా ఎన్టీఆర్ కాలం నాటి రోజుల్ని త‌ల‌పిస్తుంది. హీరో క‌త్తి  ప‌ట్టిన స‌న్నివేశాలు....శ‌త్రు మూక‌ల్ని వెంటాడ‌టం... సంభాష‌ణ‌ల్లో ప‌రుష ప‌ద‌జాలం వంటివి  చూస్తుంటే  సినిమా తీసింది అడ్డాలేనా? అన్న డౌట్ వ‌స్తుంది.

పైగా ఎప్పుడు కెమెరా వెనుక ఉండే శ్రీకాంత్ ఈసారి మ్యాక‌ప్ వేసుకుని కెమెరా ముందుకు రావ‌డం ట్విస్ట్. అత‌ను సినిమాలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. రామ్ గోపాల్ వ‌ర్మ త‌ర‌హాలో యాక్ష‌న్ స‌న్నివేశాల్ని హైలైట్ చేస్తున్నారు.  పైగా ఈ సినిమా రెండు భాగాలు గా రిలీజ్ చేస్తున్నారు. పెద‌కాపు మొద‌టి భాగం  త‌ర్వాత రెండ‌వ భాగం ఉంద‌ని తెలుస్తోంది.  ఈ సినిమాకి కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు స్పూర్తిగాను క‌నిపిస్తుంది. 
Tags:    

Similar News