‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో ట్యాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మహేష్ బాబు - వెంకటేష్ లతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే. తెలుగు ప్రేక్షకులకు సుదీర్ఘ కాలం తర్వాత ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని అందించిన ఘనత శ్రీకాంత్ అడ్డాలకే దక్కుతుంది. మంచి ఫ్యామిలీ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తాడనే పేరు తెచ్చుకున్న అడ్డాల అంతలోనే ‘ముకుంద’ మరియు ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలను తెరకెక్కించి డిజాస్టర్స్ ను చవిచూశాడు. ముఖ్యంగా ఈయన బ్రహ్మోత్సవం సినిమా ఫలితంతో హీరోలు ఈయనకు చాలా దూరంగా ఉంటున్నారట.
‘బ్రహ్మోత్సవం’ ఫ్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శ్రీకాంత్ అడ్డాల ఒక కథతో అల్లు అరవింద్ వద్దకు వెళ్లాడని - అల్లు అరవింద్ కు ఆ కథ బాగా నచ్చి గీతాఆర్ట్స్ 2లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమాను నిర్మించేందుకు ఓకే చెప్పాడంటూ కొన్ని నెలల క్రితమే మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ అయితే రాలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా కూడా శ్రీకాంత్ అడ్డాల స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నాడట.
శ్రీకాంత్ రెడీ చేసిన స్క్రిప్ట్ కు హీరో నాని అయితే బాగా సూట్ అవుతాడని అల్లు అండ్ కో భావిస్తున్నారట. అందుకే నాని డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారని - త్వరలోనే శ్రీకాంత్ అడ్డాలతో గీతా ఆర్ట్స్ 2 మూవీ ప్రారంభించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే శ్రీకాంత్ తన స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నాడు. ఆ మెరుగులు ఇంకా ఎంత కాలం శ్రీకాంత్ అడ్డాల దిద్దాల్సి ఉంటుందో చూడాలి.