తన మార్కు చూపిస్తున్న అడ్డాల

Update: 2016-05-07 17:30 GMT
ఒక్కో దర్శకుడికి ఒక్కో రకం ట్రేడ్‌ మార్కు ఉంటుంది. రాజమౌళి కొత్త వెపన్స్‌ డిజైన్‌ చేయిస్తే.. పూరి పంచ్‌ లతో చంపేస్తాడు. సుకుమార్‌, విక్రమ్‌ కె కుమార్‌ వంటి దర్శకులు తమ ఇంటెలిజన్స్‌ తో ఆకట్టుకుంటారు. ఇకపోతే కేవలం తన నాలుగవ సినిమా డైరెక్టు చేస్తున్న శ్రీకాంత్‌ అడ్డాల.. తన సినిమాలో తన నేటివ్‌ కొనసీమతో పాటు మరో యాంగిల్‌ చూపిస్తాడు.

అదేంటంటే.. మీరు ఓసారి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చూస్కోండి. సినిమాలోని ఇంటి పేర్లన్నీ చూస్తే.. అవన్నీ కాపు సామాజిక వర్గానికి చెందినవే. ఇదే కనెక్షన్‌ ముకుంద సినిమాలో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమాలో కూడా అది వదిలిపెట్టినట్లు లేడు అడ్డాల. ఈ సినిమాలోనైతే ఏకంగా ఇద్దరు హీరోయిన్లతో మనోడు ''నాయుడోరింటికాడ'' అనే పాటనే పాడించేశాడు. మిక్కీ జె మెయర్‌ కంపోజ్ చేసిన ఈ పాటను అంజనా సౌమ్య అండ్‌ రమ్యా బెహరా (బాహుబలి ఫేం) పాడారు. ఆల్రెడీ సీతమ్మ వాకిట్లో సినిమాలో ఈ ప్రయోగం చేశాక.. ఆ సినిమా వర్కవుట్ అయ్యింది కాబట్టి.. ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్‌ రిపీట్‌ చేశాడా ఏంటి?

సర్లేండి.. ఈ పాట రిలీజయ్యాక అసలు దీని కథా కమామిషు ఏంటో చూద్దాం.
Tags:    

Similar News