అడ్డాల కధలకు అడ్డా అక్కడేనట..

Update: 2016-05-19 05:24 GMT
దర్శకులకు కొత్త కధలు పుట్టాలంటే ఒక్కొక్కరూ ఒక్కో శైలి ఫాలో అవుతూ వుంటారు. ఈ జాబితాలో మనకు ముందు గుర్తొచ్చే పేరు పూరిదే.. కధల కోసం బ్యాంకాక్ కి వెళ్లి టైం స్పెండ్ చెయ్యడం అతనికి అలవాటే. త్రివిక్రమ్ వంటి దర్శకులు ఇంటి దగ్గరే కూర్చుని కొత్త స్తోరీలకు శ్రీకారం చుడతానని చెప్పిన సంగతి తెలిసినదే.

అయితే కుటుంబ కధల ఎక్స్ పర్ట్ గా నిలదొక్కుకుంటున్న శ్రీకాంత్ అడ్డాల తానూ కధలు ఎక్కడ రాసుకుంటాడన్న విషయాన్ని బయటపెట్టాడు. ఒక సినిమా చిత్రీకరణ పూర్తవ్వగానే మొత్తం అన్నీ వదిలేసి వాళ్ళ సొంతవూరు రేలంగి వెళ్ళిపోతాడట. అక్కడే మూడు నాలుగు నెలలు గడిపి, ఆ వాతావరణం ఇచ్చిన స్పూర్తితో కొత్త కధలు రాసుకుంటాడని తెలిపాడు.

శ్రీకాంత్ తెరకెక్కించిన బ్రహ్మోత్సవం రేపు విడుదలకు సిద్ధంగా వుంది. ఇటువంటి సినిమాలకు కధే పెద్ద స్టార్ అని, దాన్ని మహేష్ లాంటి హీరోలు చెబితేనే ఎక్కువమందికి రీచ్ అవుతుందని తెలిపాడు. ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్.. 
Tags:    

Similar News