శ్రీకాంత్ స్వీట్ డాట‌ర్ ఎంట్రీ అంత వీజీ కాదు!

Update: 2022-02-11 15:30 GMT
శ్రీకాంత్-ఊహాల గారాల ప‌ట్టి మేధ‌. ఈ దంప‌తుల‌కు ఒకే ఒక్క కుమార్తె. ఇద్ద‌రు కుమారులు రోష‌న్..రోహన్ న‌డుమ మేధ ఎంతో గారాబంగా పెరిగింది. మేధ త‌ల్లికి  అచ్చు గుద్దిన‌ట్లే ఉంటుంది. తండ్రి ఫీచ‌ర్స్ అక్క‌డ‌క్కా క‌నిపిస్తాయి. ఇటీవ‌లే మేధ స్కూలింగ్ పూర్తిచేసి కాలేజీలో లైప్ లోకి అడుగు పెట్టింది. ప్ర‌స్తుతం స్ట‌డీస్ పైనే ఏకాగ్ర‌త  పెట్టింది.  ఇటీవ‌లే శ్రీకాంత్-ఊహా 25వ మ్యారేజ్ యానివ‌ర్స‌ర‌రీ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పిల్ల‌ల‌తో క‌లిసి జంట ఆనందంగా గ‌డిపింది.

ఆ స‌మ‌యంలో మేధ కొత్త ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. రోహ‌న్..రోష‌న్ మ‌ద్య‌లో మేధ నిల‌బ‌డి కెమెరాకి ఫోజులిచ్చింది. ఇందులో మేధ ఫుల్ హ్యాండ్స్ టీ ష‌ర్టు ధ‌రించి చిల‌క‌లా న‌వ్వుతోంది.

నెట్టింట ఆ ఫోటో వైర‌ల్ గా మారింది. మీడియాలో పెద్ద‌గా శ్రీకాంత్ ఫ్యామిలీ క‌నిపించ‌దు. ఇలా ఒక్క‌సారిగా మేధ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా  మార‌డంతో  అందంగా ఉంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా? అన్న సందేహాలు మొద‌ల‌య్యాయి.

 అయితే మేధ చ‌దువుకుంటుంది కాబ‌ట్టి ఇప్పుడే సాద్య‌ప‌డ‌దు. పైగా ఫ్యామిలీ నిర్ణ‌యించాలి. మ‌రి శ్రీకాంత్  డెషిష‌న్ ఎలా ఉండ‌బోతుంది?  అని విశ్లేషిస్తే...రోష‌న్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌క‌ముందు కుమారుడిని ఎట్టి ప‌రిస్థితుల్లో సినిమాల్లోకి తీసుకురాన‌ని..ప‌రిశ్ర‌మ ఎలా ఉందో త‌న‌కి బాగా తెలుసున‌ని..ట‌ఫ్ కాంపిటీష‌న్ న‌డుమ  మేక‌ప్ వేసుకుని తీసివేయాల్సిన ప‌రిస్థితులు వ‌స్తే? ఎలా ఉంటుందో త‌న‌కు తెలుసు కాబ‌ట్టి ఇండ‌స్ర్టీకి రానివ్వ‌ని అన్నారు.

కానీ రోష‌న్ విష‌యంలో అలా జ‌ర‌గ‌లేదు. తండ్రి ప్రోత్సాహాంతోనే  ఎంట్రీ ఇచ్చాడు. రెండు సినిమాలు చేసాడు. ఇటీవ‌లే `పెళ్లి సంద‌డి` తో హిట్ అందుకున్నాడు. ఈ నేప‌థ్యంలో మేధ విష‌యంలో ఇలా జ‌ర‌గ‌డానికి అవ‌కాశం ఉందా?

అంటే అంత వీజీ కాదు. రోష‌న్ కుమారుడు కాబ‌ట్టి వీజీగా ఎంట్రీ జ‌రిగింది. కానీ మేధ కుమార్తె కాబ‌ట్టి   ఎంట్రీ విష‌యంలో  చాలా విష‌యాలు ఆలోచించాల్సి ఉంటుంది. రోష‌న్ విష‌యంలో అంత డీప్ గా ఆలోచ‌న చేసిన శ్రీకాంత్ కుమార్తె విష‌యంలో అంత తేలిగ్గా నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి అవ‌కాశం లేదు.   
Tags:    

Similar News