శ్రీకాంత్ హీరోగా నటించిన మూవీకి మెంటల్ పోలీస్ అనే టైటిల్ ని పెట్టడం వివాదం అయిన విషయం తెలిసిందే. ఈ టైటిల్ పైనా పాత్రను తీర్చిదిద్దిన తీరు పైనా.. హైద్రాబాద్ పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంతే కాదు హీరో - దర్శకుడు నిర్మాతలకు నోటీసులు కూడా పంపారు.
తమ సినిమాలో పోలీస్ పాత్రను కించపరిచేలా ఏ విధమైన సన్నివేశాలు లేవంటూ మెంటల్ పోలీస్ మేకర్స్ వివరణ ఇచ్చారు. అయితే.. దీనిపై పోలీస్ అసోసియేషన్ సంతృప్తి చెందలేదు. పోలీసులు సినిమా నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం ఎటూ తేలకముందే.. తమ సినిమా నిర్మాణాన్ని పూర్తి చేసిన నిర్మాతలు.. చివరకు సెన్సార్ కు పంపినట్లుగా తెలుస్తోంది. అయితే మెంటల్ పోలీస్ టైటిల్ పై సెన్సార్ బోర్డ్ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
'మా టైటిల్ కు క్లియరెన్స్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డ్ నిరాకరించడంతో మాకు పేరు మార్చక తప్పడం లేదు. ఇప్పుడు మేం సినిమా పేరు నుంచి పోలీస్ ను మాత్రం తొలగించి మెంటల్ గా మార్చాం' అంటూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు శ్రీకాంత్ నటించిన మెంటల్ మూవీని ఆగస్ట్ 12న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు చెప్పారు.