శ్రీకాంత్-ఊహ ప్రేమ ఎలా పండిందంటే...

Update: 2016-09-11 05:54 GMT
శ్రీకాంత్-ఊహ.. చూడముచ్చటైన జంట. సినీ రంగంలో పని చేస్తూ ఒక్కటయ్యే జంటలకు వీళ్లిద్దరూ ఆదర్శం. ఊహ.. శ్రీకాంత్ భార్యగా మారాక సగటు ఇల్లాలిగా మారిపోయి తన ఇంటిని నడిపించిన వైనం అభినందనీయం. 20 ఏళ్ల వైవాహిక జీవితం పూర్తి చేసుకున్న ఈ జంట.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా తమ ప్రేమను పెళ్లిగా ఎలా మార్చుకున్నారో వివరించారు. ఆ ముచ్చట్లేంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘ఆమె షూటింగ్ సమయంలో ఊహతో పరిచయమైంది. తర్వాత నాలుగు సినిమాలు చేశాం. మేం ప్రేమలో ఉన్న సంగతి ఎవరికీ తెలియదు. మా రెండు కుటుంబాల పెద్దల్ని ఒప్పించడం తమాషాగా జరిగింది. ఓ రోజు మద్రాస్ లో షూటింగ్ జరుగుతుంటే నేనే డైరెక్టుగా ఊహ వాళ్లింటికి వెళ్లిపోయాను. అప్పుడు ఊహ ఇంట్లోనే ఉంది. అత్తయ్య.. మావయ్య దగ్గరకు వెళ్లి.. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేశా. వాళ్లు షాకయ్యారు. తనను మేడ మీదకు తీసుకెళ్లి నా మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి తన మెడలో వేశా. ఇదంతా అయ్యాక మా ఇంట్లో చెప్పా. వాళ్లు కూడా షాకయ్యారు. ఆ తర్వాత మా పెళ్లి జరిగింది’’ అని శ్రీకాంత్ తెలిపాడు.

ఇక ఊహ మాట్లాడుతూ.. ‘‘మా ప్రేమ గురించి ముందు ఇంట్లో చెప్పలేదు. ఐతే ఈ లోపు నాన్న వేరే సంబంధం తీసుకురావడంతో చెప్పక తప్పలేదు. మొదట కాదన్నారు. కానీ తర్వాత ఒప్పించాను. అప్పటికే శ్రీకాంత్ అప్పుడప్పుడూ మా ఇంటికి వస్తుండేవాడు. అందువల్ల తనేంటో మా వాళ్లకు తెలుసు. కాబట్టి ఒప్పించడం తేలికైంది’’ అని ఊహ చెప్పింది.
Tags:    

Similar News