బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా `ముందస్తు` ఎన్నికల వేళ రాజకీయ నాయకుల జీవితాల్ని వెండితెరకెక్కించేందుకు పలువురు దర్శకనిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. యన్ టిఆర్ - లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ - యాత్ర - థాక్రే ఆన్ సెట్స్ ఉన్నాయి. ఎంజీఆర్ - అమ్మ- జయలలిత .. చిత్రాలకు సన్నాహాలు సాగుతున్నాయి. తాజాగా తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా బయోపిక్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ స్వయంగా ఆ సినిమా గురించిన వివరాలు అందించారు. ఈ సినిమా టైటిల్ `తెలంగాణ దేవుడు`. ఇందులో కేసీఆర్ బాల్యం నుంచి ఉద్యమబాట పట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని ముఖ్యమంత్రి అయినంతవరకూ చూపిస్తారట. వాస్తవానికి కేసీఆర్ బయోపిక్ లో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి నటిస్తాడని ప్రచారమైనా - ఎట్టకేలకు శ్రీకాంత్ ఆ పాత్రలో నటిస్తున్నారన్నది ఫిక్సయినట్టే. దీనికి నవతరం దర్శకుడు హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై ఎన్.శంకర్ తెరకెక్కించిన `జై బోలో తెలంగాణ` బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఉద్యమంలో త్యాగాల నిరతిని ఉద్విగ్నభరితంగా చూపించడంలో శంకర్ సఫలమయ్యాడు. ఇప్పుడు కేసీఆర్ బయోపిక్ లోనూ ఆ ఉద్యమాన్ని ఏ కోణంలో ఆవిష్కరిస్తారో చూడాలి. ప్రస్తుతం కేసీఆర్ బాడీ లాంగ్వేజ్ గురించిన వీడియోల్ని శ్రీకాంత్ వీక్షిస్తున్నాడు. తనకు రైటర్ ఉత్తేజ్ సహకారం అందిస్తున్నారట. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలన్నది ప్లాన్. అంటే వేగంగానే చిత్రీకరణ పూర్తి చేయనున్నారన్నమాట.