యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో, గౌరీ రోనంకి దర్శకత్వంలో తెరకెక్కిన 'పెళ్లి సందD' మూవీలో శ్రీకాంత్ తనయుడు రోషన్‌కు జోడీగా నటించి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రీలీల. గత ఏడాది విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అలాగే ఇందులో తనదైన అందం, అభినయంతో పాటు నటన, చలాకితనంతో శ్రీలీల ప్రేక్షకులను మిస్మరైజ్ చేసింది.
తొలి మూవీతోనే టాలీవుడ్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న శ్రీలీల.. ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. అలాగే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా.. ఆఫర్లు వచ్చే కొద్ది తన రేటు కూడా భారీగా పెంచుకుంటూ పోతోంది.
తాజాగా ఈ బ్యూటీ నితిన్ 32వ చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
నిన్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా షురూ కానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు శ్రీలీల అందుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. నితిన్ మూవీకిగానూ శ్రీలీల ఏకంగా రూ. 1.25 కోట్లు డిమాండ్ చేసిందట. ఇక ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు సైతం అంత మొత్తం ఇచ్చేందుకు ఒకే చెప్పారని టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియాలి.
కాగా, శ్రీలీల ఇతర ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. ఈ బ్యూటీ మాస్ మహారాజ్ రవితేజకు జోడీగా 'ధమాకా' అనే సినిమాలో నటిస్తోంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
అలాగే కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి డబ్యూ మూవీలోనూ శ్రీలీల హీరోయిన్ ఖరారు అయింది. రాధాకృష్ణ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీతో జెనీలియా టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.