మహేష్ కథానాయకుడిగా కొరటాల దర్శకత్వం వహించిన శ్రీమంతుడు డే.వన్ వసూళ్లలో టాలీవుడ్ రికార్డుల్ని సవరించనుందా? సరికొత్త రికార్డుని సెట్ చేయనుందా? అంటే అవుననే అంటున్నారంతా. ఒక్క బాహుబలిని మినహాయిస్తే మిగిలిన సినిమాల రికార్డుల్ని శ్రీమంతుడు సునాయాసంగా అధిగమిస్తాడని అంచనాలు వేస్తున్నారు. ఏపీ, తెలంగాణ సహా ఓవర్సీస్‌లో మహేష్ తొలి రోజు వసూళ్లలో రికార్డులు కొట్టేయడం ఖాయం అని చెబుతున్నారు.
ఇప్పటికే తొలిరోజు బుకింగ్‌లన్నీ క్లోజ్ అయిపోయాయి. టిక్కెట్ కౌంటర్లు జామ్ అయిపోయాయి. కాబట్టి శ్రీమంతుడు రికార్డులకు తెరతీసినట్టేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమా ఒక్క తొలిరోజే రూ.20కోట్లు వరల్డ్ వైడ్ షేర్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. నైజాం నుంచి 4కోట్లు, ఓవర్సీస్, కర్నాటక, విదేశీ ప్రీమియర్లు అన్నీ కలుపుకుని 20కోట్లు పైగా వసూలు చేసే ఛాన్సుందని ట్రేడ్ వర్గాల అంచనా.
ఇప్పటివరకూ మహేష్ పేరిటే ఓ రికార్డు ఉంది. అతడు నటించిన ఆగడు తొలి రోజు నెం.1 షేర్ సాధించిన సినిమాగా రికార్డుల కెక్కింది. ఆ తర్వాత పవన్ నటించిన అత్తారింటికి దారేది నిలిచింది. ఈ రికార్డులన్నిటినీ శ్రీమంతుడు తిరగరాస్తాడనే అనుకుంటున్నారంతా. అయితే బాహుబలి రికార్డుల్ని ఇప్పట్లో వేరే ఏ సినిమా టచ్ చేయలేదు. కాబట్టి ఆ సినిమాని మినహాయించి ఇతర సినిమాల రికార్డులతోనే తొలిరోజు వసూళ్లను పరిశీలించాల్సిందే.