బాహుబలి ఎఫెక్ట్ పాజిటివే..

Update: 2015-08-06 17:46 GMT
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలు రిలీజైన ప్రతిసారీ.. అంతకుముందున్న కలెక్షన్ల రికార్డుల మీద అందరి దృష్టి పడుతుంది. కలెక్షన్ల లెక్కలు తీసి.. తమ హీరోలకు టార్గెట్ ఫిక్స్ చేస్తుంటారు అభిమానులు. మహేష్ పోకిరితో మూడేళ్ల పాటు టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ రికార్డును నెత్తిన పెట్టుకుంటే.. ‘అత్తారింటికి దారేది’ సినిమాతో పవన్ కళ్యాణ్ రెండేళ్ల పాటు రికార్డుతో కొనసాగాడు. ఐతే ఇప్పుడు పవన్ కానీ, మహేష్ కానీ హైయెస్ట్ గ్రాసర్ రికార్డుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కారణం.. బాహుబలే. మరే టాలీవుడ్ హీరో కూడా కలలోనైనా ఊహించలేని రికార్డుల్ని నెలకొల్పింది  బాహుబలి. దీంతో ఇక రికార్డుల గురించి మాట్లాడ్డం కష్టం కాబట్టి.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ మాట వినిపిస్తోంది ‘నాన్ బాహుబలి రికార్డ్స్’ అని.

బాహుబలి రికార్డుల్ని కొట్టే సినిమా ఎప్పుడొస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే మన హీరోలందరి టార్గెట్ నాన్ బాహుబలి రికార్డ్స్ మీదే. బాహుబలి గురించి ఫీలవడం మానేసి.. ఆ సినిమా నేర్పించిన మార్కెటింగ్ టెక్నిక్స్ ను ఫాలో అవుతూ.. ఆ సినిమా విస్తరించిన కొత్త ఏరియాల్లోనూ తమ  సినిమాను రిలీజ్ చేసుకోవడంపై మన స్టార్ హీరోలు కన్నేయాలి. బాహుబలి తర్వాత వస్తున్న పెద్ద సినిమా ‘శ్రీమంతుడు’ ఈ విషయంలో బాహుబలి అడ్వాంటేజ్ ను బాగానే వాడుకుంటోంది. తమిళంలో ఒకేసారి విడుదల చేయడం.. ఇండియాలోని మిగతా రాష్ట్రాల్లో కూడా మునుపటి కంటే ఎక్కువ  థియేటర్లలో రిలీజ్ చేయడం.. కొత్త ఏరియాల్లో అడుగుపెట్టడం.. ఓవర్సీస్ లో మరిన్ని ఎక్కువ ఏరియాల్లో, ఎక్కువ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడం.. హిందీ డబ్బింగ్ రైట్స్ ను భారీ మొత్తానికి అమ్ముకోవడం.. ఇవన్నీ బాహుబలి వల్ల కలిసొచ్చిన అంశాలు. ఈ అడ్వాంటేజ్ తో నాన్ బాహుబలి రికార్డుల మీద కన్నేశాడు మహేష్. ఇప్పటికే తొలి రోజు రికార్డు మహేష్ సొంతం కావడం ఖాయంగా కనిపిస్తోంది. అత్తారింటికి దారేది దాదాపు 15 కోట్లు వసూలు చేయగా.. శ్రీమంతుడు ఈజీగా 20 కోట్ల మార్కును అందుకునేలా ఉంది. కాబట్టి వర్మ అన్నట్లు ‘శ్రీమంతుడు’ మీద బాహుబలి  ఎఫెక్ట్ నెగెటివ్ గా ఏమీ లేదు. పాజిటివ్ గానే ఉందనుకోవాలి.
Tags:    

Similar News