బాహుబ‌లిని మించిన శ్రీమంతుడు

Update: 2015-11-19 07:30 GMT
మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన శ్రీమంతుడు సినిమా బ‌డ్జెట్‌ కీ - రాజ‌మౌళి తీసిన బాహుబ‌లి బ‌డ్జెట్‌ కీ అస‌లేమాత్రం పోలిక లేదు.  కానీ లోక‌ల్ బాక్సాఫీసు ద‌గ్గ‌ర మాత్రం బాహుబ‌లికి గ‌ట్టి పోటీనే ఇచ్చింది శ్రీమంతుడు. ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర 150 కోట్ల గ్రాస్‌ ని సొంతం చేసుకొని 2015లోవ‌చ్చిన మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాగా నిలిచిపోయింది. అతి త‌క్కువ బ‌డ్జెట్‌ తో తెర‌కెక్కిన శ్రీమంతుడు నిర్మాత‌ల‌కి భారీగా లాభాల పంట పండించిందని చెప్పొచ్చు. అయితే స్థాయి వేరైనా  బాహుబ‌లిని చాలా విష‌యాల్లో  శ్రీమంతుడు అధిగ‌మించాడు. ముఖ్యంగా టెలివిజ‌న్ రేటింగుల్లో.

బాక్సాఫీసు ద‌గ్గ‌రే కాకుండా  టెలివిజ‌న్‌లోనూ బాహుబ‌లికీ - శ్రీమంతుడుకీ మ‌ధ్య పోటీ జ‌రిగింది. ఏ సినిమా ఎక్కువ టీఆర్ పీ రేటింగ్స్ సంపాదిస్తుందో అంటూ అభిమానులు లెక్క‌లేసుకొన్నారు. తెలుగులో బాహుబ‌లిని మాటీవీ సొంతం చేసుకొంది, శ్రీమంతుడుని జీ తెలుగు సొంతం చేసుకొంది. ఇటీవ‌లే ఆ రెండు సినిమాలు టీవీల్లో ప్ర‌ద‌ర్శిత‌మ‌య్యాయి. బాహుబ‌లికి రికార్డు స్థాయిలో టీఆర్ పీ రేట్ వ‌చ్చింది. ఓవ‌రాల్‌ గా  ఆ ర్యాంకింగ్‌ ని శ్రీమంతుడు అధిగ‌మించ‌లేక‌పోయింది కానీ.... అర్బ‌న్ ప్రాంతాల్లో మాత్రం బాహుబ‌లిని అధిగ‌మిస్తూ రికార్డు స్థాయిలో రేటింగ్స్‌ ని సొంతం చేసుకొంది శ్రీమంతుడు చిత్రం. అర్బ‌న్ ప్రాంతంలో బాహుబ‌లికి 22.53 రేటింగ్ సంపాదిస్తే శ్రీమంతుడు మాత్రం 24.8 రేటింగ్ సొంతం చేసుకొన్నాడు. దీన్నిబ‌ట్టి  అర్బ‌న్ ఏరియాల్లో మ‌హేష్ స్టామినా ఎక్కువ‌ని అర్థ‌మవుతోంది. ఇక  ఓవ‌రాల్‌ గా చూస్తే  21.34 టీఆర్పీ రేటింగ్‌ తో బాహుబ‌లి త‌ర్వాత స్థానాన్ని సొంతం చేసుకొన్నాడు శ్రీమంతుడు.
Tags:    

Similar News