ఫోటోటాక్ : అందాల జలకన్య జలకాలాట

Update: 2022-06-16 15:30 GMT
బుల్లి తెరపై యాంకర్‌ సుమ తర్వాత ఎక్కువ మంది అభిమానించే యాంకర్‌ ఎవరు అంటే ఖచ్చితంగా శ్రీముఖి పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్‌ గా కూడా నటించి మెప్పించిన శ్రీముఖి ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఒక సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. బుల్లి తెర మరియు వెండి తెరపై సందడి చేస్తున్న శ్రీముఖి సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తూ ఉంటుంది.

తన హాట్‌ ఫోటోలతో పాటు పద్దతైన చీర కట్టు పోటోలతో.. క్యూట్‌ ఫోటోలతో శ్రీముఖి రెగ్యులర్ గా తన ఫాలోవర్స్ కు కన్నుల విందు చేస్తుంది అనడంలో సందేహం లేదు.

సోషల్‌ మీడియాలో ముఖ్యంగా ఇన్‌ స్టా గ్రామ్‌ లో ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ఎంత చెప్పిన తక్కువే. స్టార్‌ హీరోయిన్స్ రేంజ్ లో ఈ అమ్మడిని జనాలు ఫాలో అవుతున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ అమ్మడు అందాల ఆరబోత చేస్తుంది.

హీరోయిన్ లకు ఏమాత్రం తగ్గకుండా అందాల విందు చేస్తున్న శ్రీముఖి తాజాగా స్విమ్మింగ్‌ పూల్‌ లో చాలా కూల్‌ గా చిల్‌ అవుతూ తీసుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. చాలా క్యూట్‌ గా మరియు హాట్‌ గా ఉన్న శ్రీముఖిని చూసి చాలా మంది వావ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందాల జలకన్య అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తూ శ్రీముఖి అందాలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

శ్రీముఖి కి బుల్లి తెర రాములమ్మ అనే పేరు ఉంది. ఆమె ఈ ఛానల్ ఆ ఛానల్ అని కాకుండా ప్రతి ఒక్క చోట కూడా కనిపిస్తూ ఉంటుంది. అందాల విందు విషయంలో ఏమాత్రం తగ్గకుండా బుల్లితెర మరియు వెండి తెరలపై సందడి చేస్తూ స్టేజ్‌ షో లను ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇతర సినిమాల ఈవెంట్స్ కు హోస్టింగ్‌ చేస్తూ తన మార్క్ ను ఆ కార్యక్రమాలపై వేస్తూ ఉంటుంది.

ఇన్ని విధాలుగా బిజీగా ఉన్న శ్రీముఖి ఈ ఏడాది వ్యాలెంటైన్స్ డే సందర్బంగా తాను ప్రేమలో ఉన్నట్లుగా అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. అతడు ఎవరు అనే విషయాన్ని మాత్రం ఇంత వరకు ప్రకటించలేదు. ఆమె ప్రేమ వ్యవహారం ఎంతవరకు వచ్చింది.. పెళ్లి ఎప్పుడు అంటూ అంతా ఆసక్తిగా ఆమె వైపు చూస్తున్నారు.
Tags:    

Similar News