మళ్లీ బుల్లితెర పై బన్నీ సిస్టర్‌

Update: 2015-08-08 06:48 GMT
సినిమా ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు సెట్ కావడం చాలా కష్టం. అందులోనూ టాలీవుడ్ లో అయితే... అందరికీ పొరుగింటి పుల్లకూరే రుచిగా ఉంటుంది. అందులోనూ టీవీ నుంచి వచ్చి, తెలుగు హీరోయిన్ గా సెట్ కావడం అరుదు. ట్రై చేసినోళ్లు చాలామందే ఉన్నా... స్వాతి ఒక్కతే ఇఫ్పటివరకూ సెట్ అయింది.

ఇప్పుడిలా సినిమాల్లో ట్రై చేసి విసుగెత్తి పోయి మళ్లీ బుల్లితెరకొచ్చేసింది యాంకర్ శ్రీముఖి. జులాయి మూవీలో అల్లు అర్జున్ చెల్లెలి గా నటించింది శ్రీముఖి. ఇక బన్నీ సిస్టర్‌ అని ఫుల్‌ పేరు రావడంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చేశాయి. తరువాత ప్రేమ్ ఇష్క్ కాదల్ తో హీరోయిన్ కూడా అయింది. ఆ తర్వాత కూడా ఒకట్రెండు మూవీ ఛాన్సులొచ్చినా, ఆశించిన గుర్తింపు మాత్రం దక్కలేదు. కొన్ని సినిమాలు ఇంకా రిలీజ్‌ కాలేదు కూడా. దీంతో తనకు బుల్లితెరే బెస్ట్ అని డిసైడైనట్లు ఉంది.

లేటెస్ట్ గా సైమా అవార్డుల ఫంక్షన్ లో ఆలీతో కలిసి యాంకరింగ్ చేసింది శ్రీముఖి. అంతకుముందు హోరా హోరీ సినిమా ఆడియో లాంచ్‌ కూడా అమ్మడే హోస్టు చేసింది. చూస్తుంటే స్మాల్ స్క్రీన్ కి ఫిక్స్ అయినట్లుగానే అనిపించింది వాలకం. మీ డైరెక్టర్లున్నారే.. తెలుగోళ్లను అసలు పట్టించుకోరు.. ఎంతసేపూ ముంబై, చెన్నై అంటూ తిరుగుతూనే ఉంటారు... అంటూ త్వరలో శ్రీముఖి సెటైర్ వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు..
Tags:    

Similar News