‘జయమ్ము నిశ్చయమ్మురా’కు.. జేడీకి లింకేంటి?

Update: 2016-11-16 05:49 GMT
ఈ మధ్య కాలంలో విడుదలకు ముందు పాజిటివ్ బజ్ వచ్చిన చిన్న సినిమాల్లో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ ఒకటి. ‘గీతాంజలి’తో హీరోగా మారిన శ్రీనివాసరెడ్డి.. మరోసారి కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. ‘గీతాంజలి’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీలో నటించాక రెండో ప్రయత్నంలోనూ భలే మంచి సినిమాను ఎంచుకున్నాడే అంటూ శ్రీనివాసరెడ్డి టేస్టును అందరూ పొగుడుతున్నారు ప్రస్తుతం. ఐతే ఈ సినిమా అనుకోకుండా తన చేతికి వచ్చిందని.. అందుకు తాను జేడీ చక్రవర్తికి కృతజ్నతలు చెప్పుకోవాలని అంటున్నాడు శ్రీనివాసరెడ్డి.

‘‘గీతాంజలి తర్వాత దాదాపు 80 దాకా హార్రర్ స్టోరీలు విన్నాను. అందులో ఒకటి నచ్చి సినిమా మొదలుపెట్టాం. ఆ కథ గురించి తెలిసిన ఓ మిత్రుడు నన్ను హార్రర్ స్టార్ అన్నాడు. వరుసగా ఒకే తరహా సినిమాలు చేస్తే ఇలా అంటారా అనుకున్నాను. ఐతే కొన్ని కారణాల వల్ల ఆ హార్రర్ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత ఎలాంటి సినిమా చేద్దామా అని ఆలోచిస్తుండగా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ నా దగ్గరికి వచ్చింది. ఐతే ఈ కథను నాతో చేయమని దర్శకుడు శివరాజ్ కనుమూరికి చెప్పింది జేడీ చక్రవర్తి. ఈ క‌థ‌కు నేనైతే బాగుంటుంది ఆయనే చెప్పారట. నేను జేడీ గారితో క‌లిసి న‌టించ‌లేదు. ఆయ‌న‌తో నాకు ప‌రిచ‌యం కూడా లేదు. ఆయ‌న ఈ క‌థ‌కు నేను సూట్ అవుతాను అని చెప్ప‌డంతో ఈ క‌థ విన్నాను. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టుగా నేను ఎలాంటి క‌థ కోసం ఎదురుచూస్తున్నానో అలాంటి క‌థే నా ద‌గ్గ‌ర‌కి రావ‌డంతో రెండో ఆలోచ‌న లేకుండా వెంట‌నే ఓకే చెప్పేసాను. శివరాజ్ ఇంతకుముందు రామ్ గోపాల్ వర్మ.. జేడీ చక్రవర్తి.. ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి దర్శకుల దగ్గర పనిచేశారు. లండన్‌ వెళ్లి బాగా సంపాదించి.. ఆ డబ్బు పెట్టి ప్యాషన్‌తో సినిమా చేయడానికి ఇక్కడికొచ్చారు. అతను కచ్చితంగా దర్శకుడిగా మంచి స్థాయికి వెళ్తాడు’’ అని శ్రీనివాసరెడ్డి తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News