నితిన్ , రాశి ఖన్నాల కాంబోలో సతీష్ వేగేశ్న తెరకెక్కించిన `శ్రీనివాస కల్యాణం` సినిమా గత గురువారం నాడు విడుదలైన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. టాక్ సంగతి పక్కనబెడితే కలెక్షన్లు రావడం లేదని, నితిన్ కు హ్యాట్రిక్ ప్లాప్ అని ట్రేడ్ విశ్లేషకులు కూడా డిసైడ్ చేశారు. దాదాపుగా రివ్యూలు, సోషల్ మీడియాలో నెటిజన్ల రెస్పాన్స్ కూడా అంతే ఉంది. అయితే, అవేమీ పట్టించుకోని దిల్ రాజు `సక్సె స్ మీట్`అంటూ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. అయితే, తమ సినిమా హిట్ అని....ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరిస్తున్నారని చెప్పి ముగిస్తే బాగుండేది. అయితే, సక్సెస్ మీట్ అని పేరుపెట్టి.... తమ సినిమాకు మొదటి రోజే డివైడ్ టాక్ వచ్చిందని ఓ పక్క చెబుతూనే....మరో పక్క కలెక్షన్లు రాలేదంటూ వాపోవడం చర్చనీయాంశమైంది. దీంతో, తమ సినిమా ప్లాప్ అని ఒప్పుకోవడానికి సక్సెస్ మీట్ పెట్టినట్లుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఒక్క దిల్ రాజు మాత్రమే కాదు....యూనిట్ మొత్తం పైకి సక్సెస్ అని చెబుతున్నా....లోపల ప్లాప్ అనే ఫీలింగ్ స్పష్టంగా కనిపించింది. మ్యాట్నీటైం నుంచి సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిందని, యూత్ తో పాటు రివ్యూయర్లకు సినిమా నచ్చలేదని దిల్ రాజు క్లీయర్ గా చెప్పేశాడు. కలెక్షన్లు కూడా రావడంలేదని అంటూనే వీకెండ్స్ లో వసూళ్లు పర్లేదని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సినిమా రిజల్ట్ తననను కన్ ఫ్యూజ్ చేస్తోందన్నాడు. ఇక, హీరో నితిన్....తన సినిమా ప్లాప్ అని డైరెక్ట్ గా చెప్పేశాడు. ఫ్యామిలీస్ నుంచి రెస్పాన్స్ బాగుందని, కానీ - గుర్తింపు - కలెక్షన్లు రావట్లేదని వాపోయాడు. భవిష్యత్తులో తమ సినిమాకు గుర్తింపు తప్పక వస్తుందని వేదాంత ధోరణిలో మాట్లాడాడు. ఇక దర్శకుడు సతీష్ - హీరోయిన్ రాశి ఖన్నా....అంతా మూకుమ్మడిగా...ఇదే తరహాలో మాట్లాడారు. చూస్తుంటే, వీరంతా కలిసి సినిమా ప్లాప్ అని డిక్లేర్ చేయడానికి సక్సెస్ మీట్ పెట్టినట్లుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.