చాలామంది దర్శకుడు ఒక కథ రాసేటపుడే హీరోగా ఎవరైతే బాగుంటుందని ఊహించుకుంటారు. వాళ్లను దృష్టిలో ఉంచుకునే కథ పూర్తి చేస్తారు. కొన్నిసార్లు కథలు రెడీ అయ్యాక హీరోల్ని అనుకుని వాళ్లను సంప్రదిస్తుంటారు. కానీ అన్నిసార్లూ ముందు అనుకున్న హీరోలతోనే సినిమాలు తెరకెక్కవు. వాళ్లు నో చెబితే వేరే వాళ్లను ఆశ్రయిస్తుంటారు. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘శ్రీనివాస కళ్యాణం’ కోసం కూడా ముందు అనుకున్న హీరో నితిన్ కాదని.. ఈ కథను వేరే హీరోలకు చెప్పారని.. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఐతే తనకు ఈ కథ నప్పదని భావించి ఎన్టీఆర్ తిరస్కరించాడని కూడా వార్తలొచ్చాయి. ఈ విషయం నిజమనే అనిపిస్తోంది. స్వయంగా దిల్ రాజే ‘శ్రీనివాస కళ్యాణం’ కథను ఎన్టీఆర్ కు చెప్పినట్లు వెల్లడించాడు.
తమ సంస్థలో ఏ సినిమాకు స్క్రిప్టు తయారైనా.. దానికి హీరోలుగా ఎవరైతే బాగుంటారో ఆలోచించి రెండు మూడు పేర్లు రాసుకుంటామని.. ‘శ్రీనివాస కళ్యాణం’ కోసం అలాగే జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల పేర్లు రాశామని రాజు వెల్లడించాడు. ఈ కథను ఎన్టీఆర్ కు చెప్పడం కూడా జరిగిందన్నాడు. కానీ ఎన్టీఆర్ ఏమన్నాడు.. అతడితో ఎందుకు సినిమా తీయలేదు అన్నది మాత్రం రాజు చెప్పలేదు. నితిన్ కు కథ చెబితే మాత్రం చాలా సంతోషంగా ఒప్పుకున్నాడని రాజు చెప్పాడు. ఐతే ఏమాత్రం హీరోయిజం లేకుండా.. ప్రత్యేకంగా అనిపించని హీరో పాత్రతో క్లాస్ గా.. ఫ్లాట్ గా సాగిపోయే ‘శ్రీనివాస కళ్యాణం’ ఎన్టీఆర్ కు సూటయ్యేది కాదని సినిమా చూసిన ఎవ్వరైనా చెప్పేస్తారు. అందులోనూ ఈ సినిమాకు మామూలుగా కూడా మంచి ఫలితం రాలేదు కాబట్టి ఎన్టీఆర్ నో చెప్పి మంచి పనే చేశాడనుకోవాలి.