ఓ వైపున జోరున వర్షం కురుస్తోంది. ఆ వర్షం నీరు ఇంటి పైకప్పు చిల్లు నుంచి నేరుగా బెడ్ పై కారుతోంది. ఆ నీటిని పట్టేందుకు ఒక బకెట్ ని పెట్టాడు అతడు. భార్య పిల్లలు ఆ వర్షం నీటిలో ఆ రాత్రంతా తడవకుండా ఎలా కాపాడుకోవాలో తెలీని పరిస్థితి. అంతటి పేదరికంలోనూ ఒకటో తేదీ వస్తే అద్దె కట్టాలి.. పసోడికి పాలు కావాలి టైముకి.. తాను తిన్నా తినకపోయినా కుటుంబాన్ని కాపాడుకోవాలి.. అయితే అది ఎలా? ఇలాంటి పరిస్థితి లోనూ పేదరికాన్ని ప్రతికూలతల్ని ఎదురొడ్డి పోరాడాడు. చివరికి అనుకున్నది సాధించుకున్నాడు. అయినా ఇది రంగుల పరిశ్రమ కదా! ఇక్కడ ఎప్పుడూ లక్ కలిసి రాదు కదా? అందుకే మళ్లీ స్ట్రగుల్స్ తప్ప లేదు. ఇన్ని కష్టాలు వచ్చినా ఇంకా సినిమా పిచ్చితో ఇండస్ట్రీని వదల్లేదు. ఆయన అన్నిటినీ తట్టుకుని దర్శకుడయ్యారు. అందుకే ఇండస్ట్రీ పై మమకారం ఏమాత్రం తగ్గలేదు. తిరిగి చాలా గ్యాప్ తర్వాత తనని తాను నిరూపించుకునేందుకు ఆయన తిరిగొచ్చారు. ఇంతకీ ఈ కథంతా ఎవరి గురించి అంటే డమరుకం ఫేం శ్రీనివాస్ రెడ్డి గురించే.
ఒకట్రెండు కామెడీ సినిమాలతో నిరూపించుకున్న అతడి పద్ధతి .. చెప్పిన కథ నచ్చి.. స్టార్ హీరో నాగార్జున 40 కోట్ల బడ్జెట్ ఇచ్చి డమరుకం తీసే ఛాన్స్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. బ్లాక్ బస్టర్ కాకపోయినా డమరుకం అతడికి మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే కాలం కలిసొచ్చినా ఆ తర్వాత దానిని సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం శ్రీనివాస్ రెడ్డి తడబడ్డారు. అందుకే ఆ డైరెక్టర్ కెరీర్ లో ఒడిదుడుకులు ప్రతిసారీ మీడియాలో హాట్ టాపిక్.
దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత శ్రీనివాస్ రెడ్డి `రాగల 24 గంటల్లో` అనే సినిమాతో మరోసారి లక్ చెక్ చేసుకోబోతున్నారు. సత్యదేవ్- ఈషా జంటగా నటించిన ఈ చిత్రంలో శ్రీరామ్- గణేష్ వెంకట్రామన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా టైటిల్ లోగో ఆవిష్కరించారు. పోస్టర్ చూస్తుంటే క్రియేటివ్ గానే ఉంది. 24 గంటల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడబోతోందని మాత్రం అర్థమైంది. ఇక ఈ సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? అన్న దాని గురించి శ్రీనివాస్ రెడ్డి షాకిచ్చే సంగతులు చెప్పారు. ఈ వేదికపై ఆరేళ్ల కష్టాల్ని తలుచుకుని బాధపడిన శ్రీనివాస్ రెడ్డి వాసు అనే నిర్మాత తనకు ఈ ఛాన్సిచ్చారని తెలిపారు. డబ్బు పోయినా పర్వాలేదు.. సినిమాలంటే పిచ్చి .. అందుకే ఇక్కడ ఉన్నాను. నా తొలి సినిమా మీతో నే చేయాలని నన్ను నమ్మి ముందుకొచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతానని అన్నారు. సినిమా గురించి ముచ్చటిస్తూ... ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో కథ- కథనాలే హీరో- హీరోయిన్లు. ప్రతీ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. ఇకపై ఏడాది 3- 4 సినిమాలు కచ్చితంగా చేస్తానని అన్నారు. కామెడీ సినిమాలే దర్శకుడిని చేశాయి కాబట్టి ఈవీవీ లేని లోటును భర్తీ చేస్తానని శ్రీనివాస్ రెడ్డి ధీమాని వ్యక్తం చేసారు.