వరుసగా రెండు ఫ్లాపులు కొట్టిన టాప్ డైరెక్టర్.. తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు మీడియం హీరోతో జత కట్టడం పెద్ద విషయం కాదు. చాలామంది తమ సత్తా చాటేందుకు ఇలాంటి స్టెప్ తీసుకున్నవాళ్లే. కానీ ఆ హీరో కూడా ఫ్లాప్ లో ఉన్నవాడైతే.. అక్కడే అసలు భయం మొదలవుతుంది. ఇలా డిజాస్టర్స్ లో ఉన్న డైరెక్టర్ తో మూవీ చేసేందుకు ఆ హీరోకి కూడా గట్స్ కూడా ఉండాల్సిందే. కానీ ఇప్పుడదే జరుగుతోంది.
ఆగడు - బ్రూస్ లీల ఫ్లాప్ భారాన్ని మోస్తున్న శ్రీనువైట్ల.. తన నెక్ట్స్ మూవీని, శివంతో ఫ్లాప్ కొట్టిన రామ్ తో తీయబోతున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే రెడీ సూపర్ హిట్ సాధించింది. కామెడీతో కితకితలు పెట్టించి, మంచి హిట్ పట్టేశారు గతంలో. ఇప్పుడలాంటి మ్యాజిక్ నే రిపీట్ చేసేందుకు మరోసారి జత కట్టారని ఎప్పటినుండో తెలిసిందే. అయితే ఈ పెయిర్ మ్యాజిక్ చేస్తారా అంటూ ఇప్పుడు చాలా రూమర్లే వినిపిస్తున్నాయి. నిజానికి రెండు ఫ్లాప్స్ వచ్చినంత మాత్రాన శ్రీనువైట్లను తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు. ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్న ట్రెండ్ ని.. సృష్టించిన వాడు వైట్లనే. మరో కొత్త కాన్సెప్ట్ తోనో, తనకు అలవాటైన జోనర్ లోనో కొత్తదనం చూపించగల సత్తా ఉన్నోడు శ్రీనువైట్ల. దీనికి ఎనర్జిటిక్ హీరో రామ్ పెర్ఫామెన్స్ కూడా తోడైతే.. ఇక సినిమాకి వచ్చినోళ్లకు నవ్వుల పండగ ఖాయం.
ఇందుకు కావాల్సిందల్లా.. కరెక్ట్ గా కామెడీని ఎగ్జిక్యూట్ చేయడమే. ఇప్పుడు మంచి కసి మీద ఉన్న వైట్ల.. తనే అన్నీ అయి సినిమా తీసేయబోతున్నాడని టాక్. మరోవైపు ఇలాంటి కాంబినేషన్ తో అంటే.. నిర్మాతలు వెనకాడచ్చు. అందుకే తమ బ్యానర్ స్రవంతి మూవీస్ పైనే ఈ మూవీ చేయబోతున్నాడు రామ్.