శ్రీను వైట్ల ఇప్పుడు ఎంతటి బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడో చెప్పాల్సిన పనేమీ లేదు. స్టార్ హీరోలు ఈయన డేట్స్ కోసం వెయిట్ చేసే స్టేజ్ నుంచి మొహం చాటేసే రేంజ్ కు వచ్చేశాడు. ఆగడు.. బ్రూస్ లీ.. మిస్టర్ ఫెయిల్యూర్స్.. వైట్ల మార్కెట్ ను నమ్మకాన్ని దారుణంగా దెబ్బ తీశాయి. అయితే.. ప్రస్తుతం రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ అంటూ సినిమా చేస్తున్నాడు వైట్ల.
ఈ చిత్రం ద్వారా మళ్లీ తనకు పూర్వ వైభవం వస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు. తాను గతంలో చేసిన సినిమాల్లో జరిగిన తప్పుల గురించి పూర్తిగా పరిశోధన చేసుకుని.. వాటిని రిపీట్ కాకుండా ఉండేందుకు కొత్త టీంతో పని చేశానని చెప్పాడు ఈ దర్శకుడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. అసలు ఇప్పటివరకూ తనతో సినిమా తీసిన ఏ నిర్మాత నష్టపోలేదంటున్నాడు వైట్ల. తన రాబోయే సినిమాలో ఫుల్లు కామెడీ చూపిస్తానని.. పూర్వపు శ్రీను వైట్లను చూస్తారని చెబుతున్న వైట్ల.. సినిమాలో కంటే బైటే ఎక్కువ జోకులు పేలుస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వైట్ల తీసిన సినిమాలు వరుస ఫెయిల్యూర్స్ అయ్యి డిజాస్టర్లుగా నిలిస్తే.. నిర్మాతలు నష్టపోకుండా ఎలా ఉంటారన్నదే ప్రశ్న. బహుశా ప్రీ రిలీజ్ బిజినెస్ ను లెక్కేసుకుని ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడని.. తర్వాతి పరిస్థితులను పట్టించుకోలేదేమోనని అనుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు.