అక్టోబర్ 16నే బ్రూస్ లీ ది ఫైటర్ వచ్చేస్తుండడంపై.. వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. చిన్నగా మొదలైన వేడి దాసరి కామెంట్స్ తర్వాత మరింత హీటెక్కింది. రెండు వైపుల నుంచి కరెక్ట్ గా ఎక్స్ ప్లెనేషన్స్ వస్తున్నా.. కామెంట్స్ మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా డేట్ మార్చే అంశంపై డైరెక్టర్ శ్రీనువైట్ల స్పందించాడు.
"బ్రూస్ లీ కోసం మేం 3 నెలలు ముందుగానే డేట్ ప్రకటించాం. ఈ టార్గెట్ ను అందుకోవడానికి ఇన్ని నెలలపాటు పగలు రాత్రి చూడ కుండా కష్టపడ్డాం. చెప్పిన డేట్ కు మూవీ రెడీ అయ్యేందుకు నాన్ స్టాప్ గా నెలలపాటు చిత్రీకరించాం. ఇప్పుడు అన్నీ రెడీ అయ్యాక డేట్ మార్చమని సలహాలు ఇస్తే ఎలా" అంటున్నాడు వైట్ల. రుద్రమదేవి లాంటి చిత్రం మరోవారం ఆఢేందుకు బ్రూస్ లీ వాయిదా వేసుకోవాలనే సలహాకి.. అంత పాజిటివ్ రెస్పాన్స్ ఏం రావడం లేదు. ఉద్దేశ్యపూర్వకంగా రగిలించిన వివాదమే తప్ప.. విషయం లేదనే వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఒక వారమే గ్యాప్ ఉంటుందని తెలిసినా.. వరుస సెలవలు కావడంతోనే గుణ ఈ డేట్ ని ఎంచుకున్నాడు.
ఈ చిత్రానికి మెగాస్టార్, బన్నీ కొండంత అండగా నిలబడ్డారు. తమ చిత్రానికి రామ్ చరణ్ మూవీ కారణంగా ఎలాంటి హాని జరగదని.. గుణ - ఆయన భార్య వివరణ కూడా ఇచ్చేశారు. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పారు. అయినా దసరాలాంటి భారీ పండుగకు... 2 చిత్రాలకు కలెక్షన్స్ అందించే స్థాయి ఉందంటున్నాడు నిర్మాత డివివి దానయ్య. బన్నీ కూడా ఇన్ డైరెక్టుగా గట్టిగానే క్లాస్ పీకాడు.
"కందకు లేని దురద అని ఓ సామెత లాగా.. రెండు సినిమాలను తీసినోళ్లకి, చేసినోళ్లకి లేని అభ్యంతరాలు.. మిగతా వాళ్లకి ఎందుకో ? దిగ్గజాలని చెప్పుకునే, అనుకునే వాళ్లు.. అందుకు తగ్గట్లుగా ప్రవర్తించాల"నే కామెంట్స్ వినిపిస్తున్నాయి టాలీవుడ్ లో.