శ్రీరామ్ ఆదిత్య.. టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాతికేళ్ల కుర్రాడి గురించి చర్చ. ‘భలే మంచి రోజు’ సినిమాతో టాలీవుడ్ లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చాడీ కుర్రాడు. తొలి సినిమాతో హిట్టు కొట్టడం వేరు. డైరెక్టరుగా బలమైన ముద్ర వేయడం వేరు. శ్రీరామ్ ఈ రెండూ చేశాడు. ‘భలే మంచి రోజు’ గురించి మాట్లాడితే ముందు డైరెక్టర్ గురించే మాట్లాడాలి. అంతగా ఇంపాక్ట్ చూపించాడు శ్రీరామ్.
క్రైమ్ కామెడీ సినిమాలు చూడ్డానికి మామూలుగా ఉంటాయి కానీ.. వీటిని డీల్ చేయడం అంత వీజీయేం కాదు. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉండేలా చూసుకోవాలి. రెగ్యులర్ ఫార్మాట్ లో వెళ్లడానికి అవకాశాలు తక్కువ. ఈ తరహా సినిమాల్లో ప్రేక్షకులు ఎక్కువ కొత్తదనం - ట్విస్టులు - సర్ ప్రైజులు కోరుకుంటారు. శ్రీరామ్ ఈ విషయాల్లో ఏమాత్రం నిరాశ పరచలేదు. ప్రేక్షకులు కోరుకున్న దానికంటే ఎక్కువే అందించాడతను.
దర్శకుడిగా శ్రీరామ్ టేస్టు, అతడికున్న క్లారిటీ.. ప్రతి సన్నివేశంలోనూ కనిపించాయి. ప్రతి సన్నివేశం కొత్తగా ఉండాలన్న అతడి తపన కూడా స్పష్టంగా అర్థమైంది. శ్రీరామ్ ఐడియాస్ కొత్త దనం కోరుకునే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. దర్శకుడిగా తొలి సినిమాతోనే ప్రత్యేకమైన ముద్ర వేశాడు శ్రీరామ్. భవిష్యత్తులో శ్రీరామ్ నుంచి మరిన్ని మంచి సినిమాలు ఆశించవచ్చని ‘భలే మంచి రోజు’ చూస్తే తెలుస్తుంది. మొత్తానికి శ్రీరామ్ రూపంలో ఓ ప్రతిభావంతుడు ఇండస్ట్రీకి పరిచయ్యాడన్నమాట.