స్టార్లు దొరుకుతారా శ్రీరామా?

Update: 2018-10-29 16:30 GMT
క్రేజీ మల్టీ స్టారర్ గా విడుదలైన నాగార్జున నానిల దేవదాస్ ఆశించిన మేరకు విజయం సాధించలేకపోయినా జస్ట్ యావరేజ్ అనే ముద్ర వేయించుకోవడానికి  సైతం చాలా కష్టపడింది. ఇద్దరు హీరోలను దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డీల్ చేసిన తీరు మెప్పించేలా లేకపోవడంతో ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. కథా కథనాల విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే దేవదాస్ ఖచ్చితంగా పెద్ద హిట్ అయ్యేది అనే కామెంట్ లో నిజం లేకపోలేదు. కాకపోతే ఇప్పటిదాకా తీసిన మూడు సినిమాల ద్వారా తనలో చెప్పుకోదగ్గ టెక్నీషియన్ ఉన్నాడని ప్రూవ్ చేసిన శ్రీరామ్ ఆదిత్య తన కొత్త సినిమా కోసం హీరో వేటలో ఉన్నాడట.

చిన్న లేదా మీడియం కాకుండా స్టార్లనే టార్గెట్ చేసినట్టు సమాచారం. తనకున్న పరిచయాలు ఉపయోగించి హీరోల అపాయింట్మెంట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు టాక్ ఉంది. ఎవరు ఓకే చేసినా వెంటనే షూటింగ్ మొదలుపెట్టేలా యమా ఉత్సాహంగా  ఉన్నాడట. శ్రీరామ్ టార్గెట్ చేసిన హీరో లిస్ట్ చూస్తే అది అంత సులభంగా జరిగేలా మాత్రం కనిపించడం లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికీ త్రివిక్రమ్ తో లాక్ అయిపోయాడు కాబట్టి మరో ఆరేడు నెలల దాకా ఇంకే కథను వినే మూడ్ లో ఉండడు. సాయి ధరమ్ తేజ్ డబుల్ డిజాస్టర్ హ్యాట్రిక్ దెబ్బకు స్క్రిప్ట్ విషయంలో దర్శకుడి ట్రాక్ రికార్డు గురించి చాలా జాగ్రత్తగా ఉన్నాడు. దానికి తోడు ఇటీవలే చిత్రలహరి మొదలుపెట్టేసుకున్నాడు కాబట్టి ఇప్పట్లో దొరకడం కష్టం.

ఇక నితిన్ విషయానికి వస్తే ఛలో ఫేమ్ వెంకీ కుడుములుతో భీష్మ(వర్కింగ్ టైటిల్)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. దీని తర్వాత చంద్రశేఖర్ యేలేటితో సైతం ఒక ప్రాజెక్ట్ ఉండబోతోంది. సో తను అందుబాటులో లేడు. మరి ఇంత టైట్ షెడ్యూల్స్  లో శ్రీరామ్ ఆదిత్యకు దొరికే హీరో ఎవరో. మీడియం రేంజ్ అయినా  పర్వాలేదు అనుకుంటే రాజ్ కిరణ్ -సుధీర్ బాబు లాంటి వాళ్ళను ట్రై చేయొచ్చు. మరి ఇతని మనసులో ఏముందో.
    

Tags:    

Similar News