ఎంగేజ్ మెంట్ రోజున తన లైఫ్ లో ఏం జరిగిందో చెప్పిన శ్రీసత్య

Update: 2022-10-25 04:43 GMT
బిగ్ బాస్ సీజన్ 6లో ఇప్పటికి 51 రోజులు గడిచిపోయాయి. వందకు పైగా రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సిన కంటెస్టెంట్లకు ఇప్పటికి దగ్గర దగ్గర సగం రోజులు గడిచిపోయినట్లే. ఇంట్లో ఉన్న సభ్యుల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న వారిలో ఒకరు శ్రీసత్య. తన గ్లామర్ తో పాటు.. తన అటిట్యూడ్ తో పలువురిని ఆకర్షిస్తున్నా.. కొందరు మాత్రం ఆమెను వాడుకొని వదిలేసే వ్యక్తిగా చూస్తుండటం కనిపిస్తోంది.

అయితే.. తన వ్యక్తిత్వం ఎలాంటిది? తన జీవితంలో తనకు ఎదురైన పరిస్థితులు ఏమిటన్న దానిపై తాజా ఎపిసోడ్ లో మరో కంటెస్టెంట్ రేవంత్ తో షేర్ చేసుకున్న విషయాల్ని చూసినప్పుడు.. తనపై నెగిటివ్ గా మాట్లాడే వారికి.. తన అటిట్యూడ్ వెనుకున్న అసలు సంగతి ఇది అన్న భావన కలిగేలా చేయటంలో శ్రీసత్య సక్సెస్ అయ్యారని చెప్పాలి. తాజా ఎపిసోడ్ లో రేవంత్ తో మనసు విప్పి మాట్లాడింది శ్రీసత్య.

తన జీవితంలో ఫస్ట్ ఫంక్షన్ తన ఎంగేజ్ మెంట్ అని.. ఆ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాల్ని చెప్పుకొచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ గురించి ఎవరేం చెప్పినా.. వారందరిని తాను శత్రువుగా చూసేదానినని.. రిలేషన్ లోకి వెళ్లిన తర్వాత అమ్మాయిగా మారిపోయినట్లు చెప్పింది. అప్పటివరకు ఉన్న శ్రీసత్య స్థానంలో ఒక అమ్మాయి వచ్చేసిందని చెప్పింది. అతడి ఇష్టమే తన ఇష్టంగా మారిందని చెప్పింది.

 కానీ.. ఎంగేజ్ మెంట్ రోజున స్టేజ్ మీదనే తనను తిట్టేశాడని.. నెల తర్వాత అతనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను తనకు కొందరు అమ్మాయిలు చూపించిన వైనాన్ని గుర్తు చేసుకుంది.

ఆ తర్వాత చాలా జరిగాయని.. తన తల్లి ఆసుపత్రిలో చేరటంతో తాను పాత సత్యగా మారిపోయిన వైనాన్ని చెప్పుకొచ్చి.. అందరిని టచ్ చేసింది. రియల్ లైఫ్ లో తన జీవితం గురించి.. తనకున్న చేదు గురుతుల గురించి చెప్పిన శ్రీసత్య.. తన అటిట్యూడ్ ఎందుకు అలా ఉంటుందన్న దానికి సరైన జస్టిఫికేషన్ ఇచ్చినట్లైందన్న మాట వినిపిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News