'సాక్ష్యం' సాక్షిగా మళ్ళీ అదే సెంటిమెంట్

Update: 2017-10-17 06:41 GMT
రణం.. లక్ష్యం.. శౌర్యం.. శంఖం.. లౌక్యం.. శౌఖ్యం.. ఇవన్నీ రైమింగ్ కోసం రాసిన పదాల తరహాలో ఉన్నా కూడా.. ఇవన్నీ గోపిచంద్ సినిమాలే అనే సంగతి తెలిసిందే. అయితే వీటిలో 'లక్ష్యం' సినిమాను తీసిన దర్శకుడు శ్రీవాస్.. ఆ తరువాత గోపిచంద్ తో 'లౌక్యం' కూడా తీశాడు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను వేరే హీరోపై కూడా రుద్దేస్తున్నాడు.

అసలే సెంటిమెంట్లకు స్వర్గసీమ మన తెలుగు చిత్రసీమ. అందుకే ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తీస్తున్న సినిమాకు శ్రీవాస్ కూడా అవే సెంటిమెంట్లను ఫాలో అయిపోతున్నాడు. ఇప్పటివరకు పేరున్న డైరక్టర్ల కారణంగా సినిమాలు ఆడేశాయే కాని.. ఒక్క సినిమాను కూడా సొంతంగా నిలబెట్టలేకపోయాడు శ్రీనివాస్. అందుకే ఇప్పుడు శ్రీవాస్ తో కలసి వస్తున్న సినిమాకు అన్ని సెంటిమెంట్లనూ నమ్ముకుంటున్నాడు. ఈ సినిమాకు మనోళ్ళు ''సాక్ష్యం'' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా రేపు కాని ఎల్లుండ కాని ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారట. అయితే ఇలా టైటిల్ సెంటిమెంట్ ఉంటే సినిమా వర్కవుట్ అవుతుందా లేదంటే డిక్టేటర్ వంటి పేలవమైన కథలను మాస్ కంటెంట్లను తీసుకుంటే సినిమా ఆడుతుందా?

నిజంగానే మన తెలుగు ఫిలిం మేకర్లందరూ కూడా ఇలాంటి సెంటిమెంట్లను పక్కనెట్టేసి.. చక్కగా కంటెంట్ మీద ఫోకస్ పెడితే బెటరేమో. అలా కాకుండా సెంటిమెంట్ వెంటనే పరిగెడుతుంటే.. అసలు సినిమాలు ఎందుకు ఆడతాయి? ఒకేవళ ఆడేసి వాటికి డబ్బొచ్చినా కూడా.. జనాలు ఆ సినిమాలను ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోరు.
Tags:    

Similar News