ఓ డైరెక్టర్ - ఓ హీరో కాంబినేషన్ ఒక సినిమా హిట్ అయితేనే.. క్రేజీ కాంబినేషన్ అంటారు. అలాంటిది ఓ హీరోతో రెండు హిట్స్ సాధించాక.. మూడో సినిమా కూడా ఒక దర్శకుడు ప్లాన్ చేశాడంటే.. ఖచ్చితంగా హిట్ అనే అంచనాలు ఇండస్ట్రీలో ఉంటాయి. బాలయ్యతో డిక్టేటర్ మూవీని రూపొందించిన శ్రీవాస్.. ఇప్పుడు హీరో గోపీచంద్ తో కొత్త సినిమాకి కమిట్ అయ్యాడు.
' గోపీచంద్ హీరోగా మరో సినిమా చేయబోతున్నాను. గతంలో మా ఇద్దరి కాంబినేషన్ లో లక్ష్యం - లౌక్యం సినిమాలు వచ్చి సక్సెస్ సాధించాయి. ఆ రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత మేమిద్దరం కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఖచ్చితంగా అంచనాలు ఎక్కువగా ఉంటాయి. గత రెండు సినిమాలకు మించి ఈ మూవీ ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. త్వరలో ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తా' అంటూ శ్రీవాస్ చెప్పాడు. అయితే.. డిక్టేటర్ తర్వాత శ్రీవాస్ పై అంచనాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
ప్రెజెంటేషన్ పరంగా బాలయ్యను కానీ, ఏ హీరోనైనా గ్రాండ్ గా చూపిస్తున్నాడనే టాక్ ఉన్నా.. స్టోరీ పరంగా మాత్రం రొటీన్ సినిమాలను తీస్తున్నాడనే టాక్ ఉంది. మళ్లీ మళ్లీ అదే అరిగిపోయిన ఫార్ములానే నమ్ముకుంటున్నాడనే విమర్శ ఉంది. మరోవైపు గోపీచంద్ కూడా ఇలాగే ట్రై చేసి బొక్కబోర్లా పడ్డాడు. మరి వీరిద్దరూ ఆ రొటీన్ కంటెంట్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ఏమైనా ట్రై చేస్తారా అనుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు.