'మనం' అక్కినేని అభిమానులకు ఎన్నో మధురస్మృతుల్ని మిగిల్చింది. ఏఎన్నార్ నటించిన చిట్ట చివరి సినిమా ఇది. అక్కినేని త్రయం (3తరాల హీరోలు) నటించిన సినిమాగా వరల్డ్ ఫేమస్ అయ్యింది. అంతేకాదు ఇప్పుడు 'మనం' ఫిలిఫేర్ -సౌత్ పోటీ బరిలో నిలిచింది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కథానాయికగా నటించిన శ్రీయ శరణ్ ఏఎన్నార్‌కి సంబంధించిన ఎన్నో ఆసక్తికర సంగతుల్ని చెప్పింది.
భారతదేశంలోని గొప్ప నటుల్లో ఏఎన్నార్ ఒకరు. మీకు తెలుసా? ఏఎన్నార్ పేరిట అమెరికాలో ఓ స్టాంప్ కూడా ఇష్యూ చేశారు. అతడు విశ్వవిఖ్యాత నటుడు అని చెప్పడానికే ఇదంతా. తనతో కలిసి మనం చిత్రంలో నటించడం నా అదృష్టం. క్యాన్సర్‌తో ఇంకో రెండు నెలల్లో చనిపోతాను అని తెలిసి కూడా ఆయన సెట్స్‌కొచ్చేవారు. అలాంటి ధైర్యం అతడికి మాత్రమే సాధ్యం. నేను చాలా సంతోషంగా ఉన్నా. చివరి క్షణంలో ఆస్పత్రిలో గడపడం కంటే ఇలా కెమెరా ముందే గడపడం తనకి ఎంతో ఇష్టమని చెప్పేవారు.
'మనం'లో ఏఎన్నార్ నాకు కొడుకు పాత్రలో నటించారు. ఏఎన్నార్‌తో కలిసి నటించిన ప్రతి సన్నివేశం తీపి గురుతు లాంటిదే. ఆ క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేను.. అంటూ శ్రీయ ఎంతో ఉద్వేగంగా చెప్పింది. లెజెండరీ నటుడిపై అభిమానాన్ని చాటుకోవడానికి ఏ అభిమానికైనా ఇంతకంటే గొప్ప సందర్భం ఇంకేం కావాలి. 'మనం' పలు విభాగాల్లో ఫిలింఫేర్ అందుకోవడం ఖాయం.