శ్రుతి హాసన్ సెన్సేషనల్ రికార్డు

Update: 2015-11-21 11:30 GMT
ఒకప్పుడు ఐరెన్ లెగ్ అన్న పిల్లే ఇప్పుడు గోల్డెన్ లెగ్ అయిపోతోంది. బాలీవుడ్ - కోలీవుడ్ - టాలీవుడ్.. ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ శ్రుతి హాసన్ కు ఆరంభంలో చేదు అనుభవాలే ఎదురయ్యాయి. హిందీలో చేసిన తొలి సినిమా ‘లక్’ పెద్ద ఫ్లాప్. ఆ తర్వాత తెలుగు - తమిళంలోనూ ఆమెకు అదే అనుభవం ఎదురైంది. కానీ ఇప్పుడు ఒకే ఏడాది మూడు భాషల్లోనూ వంద కోట్ల సినిమాలు అందించిన ఏకైక కథానాయికగా సెన్సేషనల్ రికార్డు ఖాతాలో వేసుకుంది శ్రుతి. తెలుగులో ‘గబ్బర్ సింగ్’తో ఊపందుకున్న శ్రుతి.. ఇప్పుడు రేసుగుర్రంలా దూసుకెళ్తోంది.

ఈ ఏడాది వేసవిలో విడుదలైన బాలీవుడ్ మూవీ ‘గబ్బర్’ డివైడ్ టాక్ తోనూ వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత తెలుగులో శ్రీమంతుడు కూడా ఈజీగా వంద కోట్ల క్లబ్బులోకి దూసుకెళ్లింది. ఆ సినిమా రూ.140 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. తాజాగా ఇప్పుడు తమిళ సినిమా ‘వేదాలం’ వంద కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టింది. ఈ సినిమా పది రోజులకే రోజులకే వంద కోట్ల క్లబ్బును అందుకోవడం విశేషం. ఇంకో విశేషం ఏంటంటే.. తమిళంలో శ్రుతికి ఇదే తొలి సూపర్ హిట్. ఇంతకుముందు ఆమె చేసిన సినిమాలేవీ సరైన ఫలితాన్నివ్వలేదు. ఒకే ఏడాది మూడు భాషల్లో వంద కోట్ల సినిమాలిచ్చిన హీరోయిన్ గా శ్రుతి పేరిప్పుడు మార్మోగిపోతోంది.
Tags:    

Similar News