#స‌లార్.. క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ జ‌ర్న‌లిస్టుగా..?

Update: 2022-03-17 07:30 GMT
కెరీర్ ప‌రంగానే కాదు రియ‌ల్ లైఫ్ లోనూ గ‌ట్సీగా ప్ర‌యోగాలు చేసేందుకు సిద్ధంగా ఉంటుంది శ్రుతిహాస‌న్. సినిమాల ఎంపిక .. మేక‌ప్.. ఫ్యాష‌న్స్ ప్ర‌తిదీ ప్ర‌యోగ‌మే. ఈ బ్యూటీ త‌న లైఫ్ లో చేయ‌ని ప్ర‌యోగం లేదు. ఇప్పుడు న‌టిస్తున్న సినిమాల్లోనూ శ్రుతికి అలాంటి అవ‌కాశాలే వ‌స్తున్నాయి.

డేరింగ్ గా గ‌ట్సీగా అనిపించే యువ‌తిగా స‌ర్ ప్రైజ్ చేయ‌బోతోంద‌ని స‌మాచారం. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న స‌లార్ లో ల‌క్కీగా ఛాన్స్ ద‌క్కించుకున్న శ్రుతి ఈ మూవీ త‌ర్వాత యాక్ష‌న్ క్వీన్ అన్న ట్యాగ్ ని అందుకుంటుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

ఇందులో శ్రుతి ఎలాంటి పాత్ర‌లో న‌టించ‌నుంది? అన్న‌దానికి ఆన్స‌ర్ దొరికింది. ఈ మూవీలో ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టుగా శ్రుతిహాస‌న్ క‌నిపిస్తుంద‌ట‌. మిస్స‌యిన మాఫియా డాన్ ప్ర‌భాస్ ని వెతుకుతూ అత‌డి వెంట ప‌డుతూ చివ‌రికి మాఫియా వ‌ర‌ల్డ్ లో తాను కూడా అనుకోకుండా భాగ‌మైపోయి క‌థ‌లో ట్రావెల్ అయిపోతుంద‌ట‌. కేజీఎఫ్ ని మించేలా ప్రభాస్‌తో యాక్షన్- మాఫియా క‌థ‌తో హై ఆక్టేన్ రాజకీయ సన్నివేశాలను ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ పాత్ర బిగ్ స‌ర్ ప్రైజింగ్ గా ఉంటుంద‌ట‌.

నిజానికి హీరో గారి ఫ్లాష్ బ్యాక్ ని తవ్వి తీయడానికి ప్రయత్నించే క్ర‌మంలో అతని వెంట పడి చివరకు క్రైమ్ వ‌ర‌ల్డ్ లో భాగస్వామిగా మారే జర్నలిస్టు పాత్రలో శృతి కనిపించనుందని అంటున్నారు.

సలార్ యూనిట్ సభ్యుల గుస‌గుస ప్ర‌కారం.. సాలార్ లో హీరోయిన్ పాత్ర చాలా సుదీర్ఘ స‌మ‌యం ఉంటుంది. కొన్ని డేర్ డెవిల్ యాక్ష‌న్ విన్యాసాలు కూడా చేస్తుందని చెబుతున్నారు. క్రాక్ త‌ర్వాత వ‌కీల్ సాబ్ లో ఆస‌క్తిక‌ర పాత్ర‌తో మెప్పించిన శ్రుతి ఇప్పుడు స‌లార్ లో మ‌రో రేంజు అనిపించే పాత్ర‌లో న‌టిస్తోంది. స‌లార్ కొంత టాకీ ఏపీ - కర్ణాటకలో చిత్రీకరించారు.

స్మాల్ బ్రేక్ దేనికి అంటే?

అయితే స‌లార్ చిత్రీక‌ర‌ణ‌కు ఇటీవ‌ల బ్రేక్ నిచ్చారు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధేశ్యామ్ రిలీజ్ ప్ర‌చారంలో బిజీగా ఉన్నాడు. దర్శకుడు ప్ర‌శాంత్ నీల్ కూడా కేజీఎఫ్ 2 పనుల‌తో బిజీ. ప్రస్తుతం యష్ నటించిన కేజీఎఫ్ 2 విడుదలకు సిద్ధ‌మవుతుండ‌గా ఆ పనులతో బిజీగా ఉన్నందున ఇవ‌న్నీ పూర్త‌యిన తర్వాత తిరిగి స‌లార్ షూటింగ్ ప్రారంభించే వీలుంది. ప్ర‌భాస్ త‌దుప‌రి `ప్రాజెక్ట్ కె`తో పాటు.. మారుతి తో రాజా డీలక్స్ వంటి సినిమా చేస్తారు. అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ వంగాతో స్పిరిట్ తెర‌కెక్కాల్సి ఉంది.
Tags:    

Similar News