చైతూకి లవ్ లెసన్స్ ఈవిడే చెప్పేది

Update: 2015-11-14 15:30 GMT
ఇలాంటి పాత్ర చేయాలి, ఇలాంటి వాటికి దూరంంగా ఉండాలి అని హీరోయిన్స్ కి ఓ లెక్క ఉంటుంది. ఇలా హీరోయిన్స్ తప్పని సరిగా చేయాలనే రోల్స్ లో కాలేజ్ స్టూడెంట్ - లెక్చరర్ పాత్రలు ఉంటాయి. ముఖ్యంగా లెక్చరర్ రోల్ తో.. కుర్రకారుకి - స్టూడెంట్స్ కి కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే అలాంటి రోల్ కోసం ఎదురుచూస్తుంటారు చాలా మంది. ఒకవేళ ఆ ఆఫర్ వస్తే మాత్రం వదిలిపెట్టరు. ఇప్పుడీ  లెక్చరర్ పాత్రలో కనిపించబోతోంది సౌత్ సుందరి శృతిహాసన్.

మళయాల బ్లాక్ బస్టర్ ప్రేమమ్ ని తెలుగులో చందు మొండేటి డైరక్షన్‌ లో నాగ చైతన్య హీరోగా తీస్తున్నారు. దీనికి మజ్ను అనే టైటిల్ పెట్టేందుకు యూనిట్ సిద్ధమవుతున్నారు. ఓ యువకుడి లైఫ్ లోని మూడు స్టేజెస్, ముగ్గురు అమ్మాయిలు, మూడు ప్రేమలను మనసుకు హత్తుకునేలా ఫుల్ లెంగ్త్ కామెడీగా ఉంటుంది ఈ మూవీ. ఇందులో మొదట ఓ కాలేజ్ అమ్మాయిన ప్రేమించిన హీరో.. తర్వాత లెక్చరర్ ని లవ్ చేస్తాడు. ఇప్పుడా లెక్చరర్ రోల్ నే శృతిహాసన్ పోషించబోతోంది.  మొన్నటివరకు ఎస్‌ ఆర్‌ నో అన్నట్లున్న ఈ న్యూస్‌ ను ఒక నేషనల్‌ న్యూస్‌ ఏజెన్సీతో ప్రొడ్యూసర్‌ రాధాకృష్ణ కన్ఫాం చేశారు.

మళయాళంలో సాయి పల్లవి పోషించిన ఈ రోల్ ని.. తెలుగులో శృతి చేస్తోంది. ఈ  పాత్ర  కోసం.. తన వేష భాషల్లో కంప్లీట్ గా ఛేంజ్ చూపించబోతోందట ఈ సుందరి. ఇందుకోసం ప్రిపరేషన్స్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. చందూ మొండేటి ఈ నవతరం మజ్నూని డైరెక్ట్ చేయనుండగా.. ఎస్ రాధాకృష్ణ నిర్మాత. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది .
Tags:    

Similar News