యాక్షన్‌ కింగ్‌ పై లైంగిక వేదింపుల ఆరోపణలు!!

Update: 2018-10-20 11:30 GMT
దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమంలో భాగంగా ఎంతో మంది ఆడవారు - హీరోయిన్స్‌ - మోడల్స్‌ - సెలబ్రెటీలు - జర్నలిస్ట్‌ లు తమపై జరిగిన లైంగిక దాడిని - తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపులను మీడియా ముందుకు తీసుకు వస్తున్న విషయం తెల్సిందే. ఈ ఉద్యమంలో భాగంగా కేంద్ర మంత్రి ఒకరు తన మంత్రి పదవిని పోగొట్టుకున్నారు అంటూ ఏ రేంజ్‌ లో ఈ ఉద్యమం సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సమయంలోనే మీటూ ఉద్యమం పక్కదారి పడుతుందనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కొందరు తమకు ఉన్న పాత పగను మీటూ ముసుగులో తీర్చుకునేందుకు వినియోగించుకుంటున్నారనే టాక్‌ వినిపిస్తుంది.

తాజాగా యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ పై కూడా మీటూ ఉద్యమంలో భాగంగా లైంగిక వేదింపుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా అర్జున్‌ ‘కురుక్షేత్రం’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రంలో హీరోయిన్‌ గా శృతి హరిహరన్‌ నటించింది. అర్జున్‌ కు భార్యగా శృతి హరిహరన్‌ నటించడం జరిగింది. చిత్రం షూటింగ్‌ లో భాగంగా అర్జున్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని - రిహార్సల్స్‌ సమయంలో ఆయన నన్ను హగ్‌ చేసుకోవడంతో పాటు, వీపున చేతితో రాశాడంటూ శృతి హరిహరన్‌ పేర్కొంది. ఆసమయంలో తాను చెప్పేందుకు సాహసం చేయలేదని, కాని ఇప్పుడు మీటూ ఉద్యమంలో భాగంగా మీడియా ముందుకు వచ్చి అర్జున్‌ గారి ప్రవర్తన గురించి చెప్పాలని అనిపించిందని, అందుకే ఇప్పుడు చెబుతున్నానని ఆమె పేర్కొంది.

అర్జున్‌ అభిమానులు మరియు ఆయన సన్నిహితులు మాత్రం శృతి హరిహరన్‌ ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఒక మంచి వ్యక్తి అనే విషయం అందరికి తెలుసు. షూటింగ్‌ లో భాగంగా ఆయన చేసిన పనిని లైంగిక వేదింపులు అంటూ విమర్శలు చేయడం తగదని, ఆమె కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తుందని, సినిమాల్లో అవకాశాలు ఇలా దక్కించుకోవాలని ఆమె ప్రయత్నిస్తుందంటూ అర్జున్‌ అభిమానులు అంటున్నారు. మొత్తానికి మీటూ ఉద్యమం కారణంగా పెద్ద ఎత్తున ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో ఏవి నిజం, ఏవి అబద్దం అనేది తెలియక సాదారణ జనాలు కన్ఫ్యూజ్‌ అవుతున్నారు.

Tags:    

Similar News