తెలుగులో చేసిన తొలి చిత్రంతోనే అదరగొట్టింది శ్రుతి సోడి. కళ్యాణ్ రామ్ తో కలిసి పటాస్ లో ఆడిపాడిందామె. ఆ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇక శ్రుతి తెలుగులో సెటిల్ అయిపోయినట్టే అని మాట్లాడుకున్నారంతా. హిట్టు సినిమా హీరోయిన్ అంటే మామూలుగానే మంచి క్రేజ్ ఉంటుంది. కానీ చిత్రంగా శ్రుతికి కొత్త అవకాశాలేమీ దక్కలేదు. మధ్యలో ఆదితో కలిసి ఓ చిత్రంలో ఛాన్స్ కొట్టిందని ప్రచారం సాగింది. అయితే ఆ తర్వాత అది కూడా అబద్ధమే అని తేలింది. దీంతో ఆమె అడ్రస్ గల్లంతయినట్టే అనుకున్నారంతా. కానీ ఆమె మళ్లీ తిరిగొచ్చింది. అయితే ఈసారి కథానాయికగా కాకుండా ఐటెమ్ పోరిగా సందడి చేసేందుకు సిద్ధమైందని సమాచారం.
తొలి తెలుగు చిత్రంలో నటించే అవకాశాన్నిచ్చిన అనిల్ రావిపూడినే శ్రుతిని ఐటెమ్ పోరిగా మార్చేశాడు. అనిల్ ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తో సుప్రీమ్ అనే చిత్రం చేస్తున్నాడు. ఆ చిత్రంలో రాశిఖన్నా కథానాయికగా నటిస్తోంది. అందులో మాంచి ఓ కిక్కిచ్చే ఐటెమ్ పాట ఉందట. ఆ పాటలో ఆడిపాడే అవకాశాన్ని శ్రుతికి కట్టబెట్టినట్టు తెలిసింది. పటాస్ లో శ్రుతి డ్యాన్సులు ఇరగ్గొట్టింది. అందుకే ఏరికోరి ఆమెకి ఐటెమ్ పాటలో నటించే అవకాశమిచ్చినట్టు తెలిసింది. మరి ఈ చిత్రం తర్వాత శ్రుతి ఐటెమ్ పోరిగానైనా అవకాశాలు అందుకొంటుందేమో చూడాలి.