జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇప్పుడు హాలీవుడ్ టచ్ 

Update: 2023-01-19 02:30 GMT
దర్శక దిగ్గజం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ఒక్కసారిగా హాలీవుడ్ రేంజ్ లో ఆర్ఆర్ఆర్ మూవీ గురించి చర్చ నడిచింది. దాంతో పాటు రాజమౌళి పేరు కూడా గట్టిగా వినిపించింది.

ఇక హాలీవుడ్ దర్శకులు స్టీవెన్ స్విల్ బర్గ్, జేమ్స్ కెమరూన్ సైతం రాజమౌళిని ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ప్రశంసించడం ప్రత్యేకత అని చెప్పాలి. జేమ్స్ కెమరూన్ గురించి ప్రపంచం మొత్తం చర్చించుకుంటూ ఆర్ఆర్ఆర్ సినిమా తనకి భాగా నచ్చింది అంటూ అతను చెప్పడం నిజంగా గొప్ప ప్రశంస అని చెప్పాలి.

రాజమౌళికి ఆర్ఆర్ఆర్ సినిమా హాలీవుడ్ లెవల్ లో హైప్ తీసుకొని రావడంతో ఇది తన నెక్స్ట్ సినిమా విషయంలో మరింత ప్లస్ అవుతుంది. అయితే ఇప్పుడు రాజమౌళి మరింతగా హాలీవుడ్ ప్రేక్షకులని కూడా దృష్టిలో ఉంచుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాని తెరకెక్కించాలి.

ఇక జక్కన్న కూడా అందుకు తగ్గట్లుగా మహేష్ బాబు సినిమా కోసం హాలీవుడ్ నటులని రంగంలోకి దించుతున్నాడు. ఇదిలా ఉంటే తమ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని గతంలో రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే. మహాభారతం కాన్సెప్ట్ ని ఐదు భాగాలుగా తెరకెక్కిస్తా అని కూడా చెప్పారు. దానిని తీసేసి సినిమాలకి స్వస్తి చెబుతానని అన్నారు. అయితే అది ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం రాజమౌళి క్లారిటీ ఇవ్వలేదు.

అయితే ప్రస్తుతం జక్కన్నకి ఉన్న ఫేమ్ నేపధ్యంలో మహాభారతం ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తే కచ్చితంగా దానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీని తెరకెక్కించి భారతీయ చరిత్ర గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం ఘనంగా పరిచయం చేయవచ్చని భావిస్తున్నారు.

రాజమౌళి విజన్ తో మహాభారతం తెరకెక్కితే మాత్రం కచ్చితంగా ఆ సిరీస్ అద్బుతం అవుతుందనే మాట ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్ లో వినిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో మహాభారతం ప్రాజెక్ట్ ని రాజమౌళి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. మరి జక్కన్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ పై ఎప్పుడు దృష్టి పెడతాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.         



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News