ఆ టైంలోనే నాకు కాంపిటీటర్ వచ్చేసాడని అనుకున్నా: రాజమౌళి

Update: 2021-06-20 12:30 GMT
సినిమా రంగంలో కాంపిటీషన్ అనేది మాములే. బయటికి చెప్పుకోరు కానీ లోలోపల మాత్రం ఎదుటివారిని పోటీగా భావించే దర్శకులు - నిర్మాతలు చాలామంది ఉంటారు. అయితే కొందరు మాత్రమే సమయం వచ్చినప్పుడు ఈ విషయాలు బయటపెడుతుంటారు. నిజానికి ఇండస్ట్రీలో కొన్నిసార్లు అసలు వీళ్ళిద్దరికి పడదు అనుకునేలా సినిమాలు చేస్తుంటారు. తీరా బయటచూస్తే బెస్ట్ ఫ్రెండ్స్ గా కనిపిస్తారు. అలాంటి కాంపిటీషన్స్ టాలీవుడ్ లో కూడా చాలానే ఉన్నాయి. నిజానికి ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ ఒకరి గురించి ఒకరికి తెలియకుండా పోటీగా భావించి ఈరోజు ఇద్దరు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు అనగానే గుర్తొచ్చే ఫస్ట్ పేరు ఎస్ఎస్ రాజమౌళి. దర్శకధీరుడుగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఆయనను పిలుచుకుంటుంది. అంటే రాజమౌళి చేసినటువంటి సినిమాలే ఆయనను ఓ జక్కన్నగా కూడా పిలిచేలా చేస్తున్నాయి. అలాగే మరో దర్శకుడు సుకుమార్. త్వరలోనే పాన్ ఇండియా దర్శకుడుగా మారబోతున్నాడు. అయితే వీరిద్దరూ కెరీర్ పరంగా వెనకాముందు ప్రారంభం అయినా సినిమా ఇండస్ట్రీ పక్కనపెడితే బయట మంచి స్నేహితులు. అలాగే ఇద్దరూ కూడా వారి లైఫ్ లో అసలు ఎలా కాంపిటీషన్ మొదలైంది అనే విషయం రాజమౌళి చెప్పాడు.

డెబ్యూ మూవీ ఆర్యతో సూపర్ హిట్ అందుకున్నాడు సుకుమార్. ఆ తర్వాత సెకండ్ మూవీగా జగడం తీసాడు. అది ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చినా ఓరల్ గా ప్లాప్ అయ్యిందనే చెప్పాలి. అయితే ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో సుకుమార్ కొంచం నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాడట. అయితే ఆ సమయంలో స్టార్ డైరెక్టర్ అయినటువంటి రాజమౌళి వచ్చి తన కారులో తీసుకెళ్లి తనకు ధైర్యం చెప్పాడని.. ఆ సమయంలో రాజమౌళి ఒక్కడే తనకు భరోసాగా నిలిచినట్లు సుక్కు తెలిపాడు. ఇదిలా ఉండగా.. ఆర్య సినిమా రిలీజై సూపర్ హిట్ అయినప్పుడే తనకు కాంపిటీటర్ వచ్చేసాడని ఫిక్స్ అయినట్లు.. అలాంటి కాంపిటీటర్ ను ఫ్రెండ్ చేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటుందని భావించినట్లు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలపడం విశేషం. ప్రస్తుతం వీరిద్దరూ పాన్ ఇండియా సినిమాలు ఆర్ఆర్ఆర్ - పుష్ప సినిమాలు రూపొందిస్తున్నారు.


Tags:    

Similar News