బాహుబలి మళ్లీ రాబోతోందా?

Update: 2017-09-22 07:38 GMT
బాహబలి సినిమాతో ఒక్కసారిగా సంచలనం సృష్టించిన రాజమౌళి ఆ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తెలిసిన విషయమే. ముఖ్యంగా ఆ సినిమా అంతటి భారీ విజయాన్ని అందుకోవడానికి కారణం జక్కన్న ఆలోచించిన విధానం. ఒకే కథను రెండు భాగాలుగా విభజించి. కథకు అవసరయ్యే విధంగా సీన్స్ ను క్రియేట్ చేసుకొని అన్ని తరహా ప్రేక్షకులను ఆకర్షించాడు.

2015 లో బాహుబలి మొదటి భాగాన్ని రిలీజ్ చేసి ఆ తర్వాత 2017 లో రెండవ భాగాన్ని రిలీజ్ చేశాడు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత రెండవ భాగానికి తార స్థాయిలో ప్రమోషన్స్ ని నిర్వహించాడు. దీంతో సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి ఇండియా సినిమా స్థాయిని పెంచింది. అలాగే ప్రతి ఒక్కరు టాలీవుడ్ వైపు తిరిగేలా చేశాడు. అయితే బాహుబలి గురించి ఇప్పుడు మరొక వార్త సంచలనంగా మారింది. బాహుబలి రెండు భాగాలను కలిపి మళ్లీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మొదటి పార్ట్ లో రెండవ పార్ట్ లోని అవసరంలేని సీన్స్ ని తీసేసి కేవలం మేజర్ పాయింట్స్ ని యాడ్ చేసి మూడుగంటల సినిమాగా చూపించబోతున్నట్లు టాక్. ఇప్పటికే రాజమౌళి కూడా ఆ విషయం గురించి ఆలోచించారట. మరి ఆ ఆలోచన సినీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News