జగదీష్‌ తో థమన్‌ మళ్లీ మ్యాజిక్‌ చేస్తాడట

Update: 2020-06-27 06:00 GMT
ఈ ఏడాది బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌.. ఇండస్ట్రీ హిట్‌ చిత్రం అల వైకుంఠపురంలో. ఆ సినిమా సక్సెస్‌ లో ఖచ్చితంగా సంగీత దర్శకుడు థమన్‌ భాగస్వామ్యం ఉంటుంది. ఆ విషయాన్ని స్వయంగా త్రివిక్రమ్‌ మరియు అల్లు అర్జున్‌ కూడా ఒప్పుకున్నారు. అల వైకుంఠపురంలో చిత్రం సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో థమన్‌ మరింత బిజీ అయ్యాడు. ఆయన డిమాండ్‌ మరింతగా పెరిగింది. ఇటీవల థమన్‌ ‘టక్‌ జగదీష్‌’ చిత్రాన్ని ట్యూన్స్‌ ను పూర్తి చేశాడట.

నాని హీరోగా రూపొందుతున్న టక్‌ జగదీష్‌ కు శివ నిర్వాన దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రం షూటింగ్‌ ను వచ్చే నెల నుండి పున: ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే సమయంలో థమన్‌ ఈ సినిమా కోసం అన్ని ట్యూన్స్‌ ఇచ్చేశాడంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. థమన్‌ ఈ చిత్రం కోసం అందించిన పాటలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

గతంలో నాని ‘నిన్ను కోరి’ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందించాడు. ఆ సినిమాలోని పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ట్యూన్స్‌ ను థమన్‌ ఇచ్చాడని ఖచ్చితంగా ఈ పాటలు అల వైకుంఠపురంలో చిత్రంలోని పాటల మాదిరిగా మ్యాజిక్‌ చేయడం ఖాయం అనే నమ్మకంతో యూనిట్‌ సభ్యులు ఉన్నారు. సెప్టెంబర్‌ వరకు సినిమాను పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.
Tags:    

Similar News