మెగాస్టార్ తో సినిమా అంటే ఏ టెక్నీషియన్ కు అయినా పెద్ద అచీవ్ మెంట్ అనడంలో సందేహం లేదు. చిరంజీవి సినిమాకు ది బెస్ట్ ఇవ్వడం ద్వారా ఇండస్ట్రీలో పాతుకు పోవాలని అనుకుంటూ ఉంటారు. అప్పటికే పాతుకు పోయిన వారు సైతం చిరంజీవి సినిమా అంటే ప్రత్యేకమైన శ్రద్ద.. ఎక్కువ ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తారు. ఇప్పుడు థమన్ కూడా అలాగే చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్ లను సూపర్ బీజీలను ఇచ్చిన థమన్ త్వరలో చిరంజీవి నటించబోతున్న లూసీఫర్ రీమేక్ కోసం ఒక ప్రయోగాత్మక బీజీని ప్లాన్ చేస్తున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆ బీజీ తో లూసీఫర్ రీమేక్ రేంజ్ ను మెగా లెవల్ కు తీసుకు వెళ్తాడట.
మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ ను రీమేక్ చేసేందుకు చిరంజీవి చాలా ఆసక్తిగా ఉన్నాడు. మోహన్ లాల్ చేసిన పాత్రను చిరంజీవి చేయబోతున్నాడు. తమిళ దర్శకుడు మోహన్ రాజ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా కు థమన్ సంగీతాన్ని ఇవ్వబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. అందుకోసం థమన్ వర్క్ ప్రారంభించాడు. లూసీఫర్ కథ చాలా సీరియస్ గా సాగుతూ ఉంటుంది. పాటలకు పెద్దగా స్కోప్ లేదు. కాని చిరంజీవి అభిమానుల కోసం ఒకటి రెండు పాటలను పెట్టే అవకాశం ఉందంటున్నారు. కాని ప్రధానంగా లూసీఫర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కే థమన్ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.
మోహన్ రాజ తో కలిసి థమన్ చేసిన బీజీ చాలా కొత్తగా ఉందని.. లూసీఫర్ రీమేక్ కోసం కొత్త థమన్ నిద్ర లేచినట్లుగా ఉందని అంటున్నారు. లూసీఫర్ రీమేక్ ఆచార్య ముగిసిన వెంటనే అంటే వచ్చే నెల చివర్లో పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు. మూడు లేదా నాలుగు నెలల్లోనే సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.