స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ల్యాండ్ మార్క్ మూవీ # RC15 సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ ఇప్పటికే ప్రారంభమైంది. నటీనటుల ఎంపిక సహా ఇతర కార్యక్రమాల్ని కానిచ్చేసేందుకు దిల్ రాజు బృందం ఇప్పటికే చెన్నయ్ లో ఆఫీస్ ప్రారంభించారని కథనాలొచ్చాయి.
ఓవైపు భారతీయుడు 2 కి సంబంధించి లైకాతో కోర్టు వివాదం నడుస్తుండగానే చరణ్- శంకర్-దిల్ రాజు బృందం కొత్త ప్రాజెక్ట్ కోసం పనులు మొదలు పెట్టేయడం ఆన్ లైన్ లో పెద్ద డిబేట్ కి తెర తీసింది. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? అన్నదానిపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది.
తాజా సమాచారం మేరకు .. ఎస్.ఎస్.థమన్ ని ఈ అరుదైన అవకాశం వరించిందని తెలుస్తోంది. నిజానికి శంకర్ ఏ.ఆర్.రెహమాన్ ని బరిలోకి తేవాలని భావించినా ఏమైందో కానీ థమన్ ఈ ప్రాజెక్టును దక్కించుకుని షాకిచ్చారు. # RC15 కి పని చేస్తున్నానని థమన్ స్వయంగా వెల్లడించడంతో దీనిపై క్లారిటీ వచ్చేసింది.
అయితే తన ఎంపికల విషయంలో రాజీకి రాని శంకర్ .. తన ఆలోచనలకు భిన్నంగా వేరొక సంగీత దర్శకుడిని ఎంచుకోవడానికి కారణమేమిటి? అయినా తన ఆస్థాన సంగీత దర్శకుడు రెహమాన్ ని వదులుకోవడం వెనక అసలు రీజన్ ఏమిటి? అంటూ ఆర్.సి అభిమానులు ఆసక్తిగా ప్రశ్నల్ని సంధిస్తున్నారు. అయితే దానికి సమాధానం కూడా సుస్పష్ఠం.
ఏ.ఆర్.రెహమాన్ తో ఉండే కాంప్లికేషన్స్ ఇందుకు కారణమని అభిమానులు భావిస్తున్నారు. ఒక సినిమాకి సంగీతం చేసేందుకు ఆయన ఎక్కువ సమయం తీసుకుంటారు. తన కన్వినెన్స్ మేరకే పని చేస్తారు. దానికోసం దర్శకనిర్మాతలు ఎంత కాలం అయినా వేచి చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు దిల్ రాజు రంగ ప్రవేశం చేసిన సినిమాకి అలా కుదురుతుందా? అంటే అందుకు ఛాన్సే లేదు. ఆయనకు ఎంతో దగ్గరివాడైన సింక్ కుదిరే థమన్ ని ఎంచుకోవడం వెనక పెద్దగా లాజిక్ కూడా వెతకాల్సిన పనే లేదని సన్నిహితుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక ఇంతకుముందు భారతీయుడు 2 చిత్రానికి శంకర్ నవతరం సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ని ఎంపిక చేసి ఆశ్చర్యపరిచారు. శంకర్ తన కెరీర్ ఆద్యంతం రెహమాన్ తో పని చేయగా.. అపరిచితుడు కోసం హ్యారిష్ జైరాజ్ తో పని చేశారు. ఆ తర్వాత అనిరుధ్.. ఇప్పుడు థమన్.. అంటూ లెక్కలేస్తున్నారు అభిమానులు. కానీ శంకర్ - రెహమాన్ కాంబినేషన్ మిరాకిల్స్ శంకర్ - థమన్ కాంబినేషన్ రిపీట్ చేయగలరా? అన్నదే ఇప్పుడు చెర్రీ అభిమానులకు టాస్క్ గా మారింది. మరి దీనికి థమన్ ప్రాక్టికల్ గా అసాధారణమైన వండర్స్ అనిపించే బాణీలతో సమాధానమిస్తారా? అన్నది చూడాలి.
తమన్ గతంలో రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ - నాయక్ లకు సంగీతం అందించారు. కానీ ఆ దర్శకులు వేరు.. ఇప్పుడు పని చేస్తున్న దర్శకుడు వేరు. మరి ఏం జరుగుతోందో వేచి చూడాలి.