సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఓ భారీ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. పుష్కరం ముందే ఈ కాంబినేషన్ లో చర్చలు మొదలవ్వగా.. ఇన్నేళ్లకు ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చుతున్నందుకు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
ప్రస్తుతం రాజమౌళి మరియు అతని తండ్రి కేవీ విజయేంద్రప్రసాద్ కలిసి మహేష్ బాబు కోసం కథ సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు బాహుబలి రచయిత ఇది వరకే వెల్లడించారు.
జక్కన్న సైతం మహేష్ కోసం రెండు లైన్లు అనుకుంటున్నట్లు తెలిపారు. 2023 జనవరిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ SSMB29 సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని RRR సినిమా విడుదలైనప్పటి నుంచే వార్తలు వస్తున్నాయి. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
రాజమౌళి ఏ సినిమానైనా సెట్స్ మీదకు వెళ్లే ముందు హీరో లుక్ - డిస్కషన్స్ మరియు ప్రీ ప్రొడక్షన్ కోసం తగిన సమయం తీసుకుంటాడనే సంగతి తెలిసిందే. అందుకే ఏ హీరో అయినా కాస్త ముందుగానే అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మహేష్ ఎప్పుడు రాజమౌళి తో కలుస్తారనేది SSMB28 సినిమాని బట్టి ఉంటుంది.
మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ చేయబడిన ఈ మూవీ ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లాల్సింది కానీ.. ఆలస్యమైంది. ఆగస్టు 15 - 16 తేదీలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.
కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మహేష్ బాబు 28వ సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ప్రారంభం అవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో సమ్మె జరుగుతోంది. తెలుగు సినిమాల షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడ ఆపేశారు.
ఈ సమ్మె ఎప్పుడు విరమిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ మహేష్ ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ లోపు బంద్ ఎత్తేయకపోతే SSMB28 సెట్స్ మీదకు వెళ్ళడానికి ఇంకాస్త టైం పట్టొచ్చు. అదే జరిగితే సినిమా పూర్తవ్వడానికి కూడా ఎక్కువ సమయమే తీసుకోవాల్సి ఉంటుంది.
త్రివిక్రమ్ ఎంత ఫాస్ట్ గా సినిమా చేసినా ఐదారు నెలల సమయం పడుతుంది. అది కూడా మధ్యలో ఎలాంటి బ్రేక్స్ పడకపోతేనే. దీనిని బట్టి ముందుగా అనుకున్నట్లు జనవరిలో SSMB29 కోసం మహేష్ అందుబాటులో ఉండే అవకాశం లేదు.
ఇక రాజమౌళి సినిమా ఎప్పుడు మొదలైనా.. ఎప్పుడు ముగుస్తుందనేది ఎవ్వరూ చెప్పలేరు. ఏడాది అన్నది రెండేళ్లు అవ్వొచ్చు.. మూడు నాలుగేళ్లు పొడిగించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందులోనూ ఇప్పుడు RRR కు గ్లోబల్ రీచ్ వచ్చిన తర్వాత.. దర్శకుడి తదుపరి చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మహేష్ తో కచ్చితంగా రాజమౌళి భారీ ప్రాజెక్ట్ ను రూపొందిస్తారు. అత్యధిక బడ్జెట్ తో హై టెక్నీకల్ వాల్యూస్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. సూపర్ స్టార్ ఈ సినిమా కోసమే కొన్నాళ్ళు అంకితం అవ్వాల్సి ఉంటుంది. అప్పటి వరకూ మరో సినిమా చేసే ఛాన్స్ అస్సలే ఉండదు. ఏం జరుగుతుందో చూడాలి.