ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెస్టివల్ మళ్లీ మొదలైంది. గత నెల ఎండింగ్ లో `భీమ్లానాయక్`తో తెలుగులో హంగమా మొదలైన విషయం తెలిసిందే. ఇదే తరహా రచ్చ తమిళ బాక్సాఫీస్ వద్ద అజిత్ `వలిమై`తో స్టార్టయింది. దక్షిణాదిలో ఈ ఇద్దరు సూపర్ స్టార్ ల కారణంగా హంగామా మొదలైతే ఉత్తరాదిలో అలియాభట్ `గంగూబాయి కతియావాడీ`తో షురువైంది. ఈ మూడు చిత్రాలతో దేశ వ్యాప్తంగా థియేటర్ల వద్ధ ఫెస్టివెల్ మొదలైందని చెప్పొచ్చు.
అయితే ఈ సెలబ్రేషన్స్ ని ఈ నెలలో థియేటర్లలోకి రానున్న చిత్రాలు మరో లెవెల్ కి తీసుకెళ్లబోతున్నాయి. అవే రాధేశ్యామ్, ఆర్ ఆర్ ఆర్. ఇందులో ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్` మార్చి 11న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ఈ మూవీ తరువాత ఇదే నెల 25న `ఆర్ ఆర్ ఆర్` రాబోతోంది. అంటే ఈ రెండు చిత్రాల మధ్య రెండు వారాల గ్యాప్ వుండబోతోంది.
ఇప్పటికే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన హంగామా ఓవర్సీస్ లో మొదలైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం `రాధేశ్యామ్` రికార్డు స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కు టైమ్ వుండటంతో దీని ప్రమోషన్స్ ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఈ రెండు చిత్రాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వున్న దాదాపు అన్ని థియేటర్లని ఆక్కుపై చేయబోతున్నాయి.
ఇందులో ముందుగా వస్తున్న `రాధేశ్యామ్` హిట్ టాక్ ని సొంతం చేసుకుంటే రెండు వారాల వరకు ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పోటీ వుండదు. సోలోగా వీర విహారం చేయడమే. అయితే ఈ గ్యాప్ ని యంగ్ హీరో రాజ్ తరుణ్ తన `స్టాండప్ రాహుల్` మూవీతో బరిలోకి దిగుతున్నాడు. ఇన్నటికే మేకర్స్ రిలీజ్ డేట్ ని లాక్ చేసేశారు. మార్చి 18న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంతో సాంటో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమా యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించినట్టుగా క్లారిటీ ఇచ్చేసింది. బజ్ సాధారణంగా వున్న ఈ యూవీని రెండు భారీ పాన్ ఇండియా చిత్రాల మధ్య విడుదల చేస్తుండటం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. ఇలా చేయడం వెనక మేకర్స్ ధైర్యమేంటీ అని నెటిజన్స్ కామెంట్ లు చేస్తున్నారు. అయితే మేకర్స్ మాత్రం ఈ మూవీ ఫలితం విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా వున్నారట.
రెండు భారీ చిత్రాల మధ్య యంగ్ హీరో సినిమాని రిలీజ్ చేయడం ఏంటీ? ...కామెంట్ లు వినిపిస్తున్నా మేకర్స్ మాత్రం ముందుకు సాగడానికే మొగ్గుచూపడం గమనార్హం. అయితే ఇంపాజిబుల్ అనుకున్న ఈ ఫీట్ ని రాజ్ తరుణ్ పాజిబుల్ చేస్తాడా? ... లేక అంతా అనుమానించినట్టే చేతులు ఎత్తేస్తాడా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.