‘మళ్ళీ రావా’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన గౌతమ్ తిన్ననూరి.. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాని తో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నాడు. రెండో సినిమాగా వచ్చిన 'జెర్సీ'.. దర్శకుడికి విమర్శకుల ప్రశంసలతో పాటుగా జాతీయ అవార్డులు కూడా తెచ్చిపెట్టింది.
దీంతో మూడో సినిమాతోనే బాలీవుడ్ లో అడుగుపెట్టే అవకాశం అందుకున్నాడు. 'జెర్సీ' రీమేక్ ని హిందీలో స్టార్ హీరో షాహిద్ కపూర్ తో చేసే ఛాన్స్ కొట్టేసాడు. అదే పేరుతో క్రికెట్ నేపథ్యంలో ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కరోనా పాండమిక్ వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. ఎట్టకేలకు ఈరోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ విడుదలైన హిందీ 'జెర్సీ' చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. బాలీవుడ్ ప్రముఖులు - క్రిటిక్స్ ఈ సినిమాని ప్రశంసిస్తూ దర్శకుడు గౌతమ్ మరియు హీరో షాహిద్ లను కొనియాడుతున్నారు. గురువారం రాత్రి ముంబైలో స్పెషల్ ప్రీమియర్ షోను ప్రదర్శించారు.
సినిమా అయ్యాక రోలింగ్ టైటిల్స్ పడేటపుడు థియేటర్లో అందరూ క్లాప్స్ కొడుతూ గౌతమ్ తిన్ననూరి కి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి షాహిద్ కపూర్ కూడా రియాక్ట్ అయ్యాడు.
"ది డైరెక్టర్. ది మ్యాన్. కెప్టెన్ ఆఫ్ ది షిప్. మీ గురించి చాలా గర్వపడుతున్నాను. మీరు ఇంకా చాలా ప్రశంసలకు అర్హులు'' అంటూ గౌతమ్ ను ఉద్దేశిస్తూ షాహిద్ ట్వీట్ చేశారు. ఒరిజినల్ లో హీరోగా నాని సైతం ట్వీట్ చేస్తూ.. గౌతమ్ హిందీలో హిట్ కొట్టాడని పేర్కొన్నారు. ఇదంతా చూస్తుంటే గౌతమ్ బాలీవుడ్ లో ఎంట్రీతోనే క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడనిపిస్తోంది.
ఇప్పటి నుంచే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గౌతమ్ చేయబోయే సినిమా గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. #RC16 పాన్ ఇండియా స్థాయిలో రూపొందే యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ - ప్రమోద్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.
'జెర్సీ' సినిమా విషయానికొస్తే.. ఒక మాజీ క్రికెటర్ తన కొడుకు కోసం 36ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్ బ్యాట్ పట్టుకోవాల్సి వస్తే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడా? లేదా జీవితంలో ఓడిపోయిన వ్యక్తిగానే మిగిలిపోతాడా? తన కొడుకు కోరుకున్న జెర్సీ అందించాడా లేదా? అనే ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కింది.
ఇందులో షాహిద్ కపూర్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా.. షాహిద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్ కీలక పాత్ర పోషించారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు ఎంటర్టైన్మెంట్స్ - దిల్ రాజు ప్రొడక్షన్ - సితార ఎంటర్టైన్మెంట్స్ - బ్రాట్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. దిల్ రాజు - సూర్యదేవర నాగవంశీ - అమన్ గిల్ నిర్మాతలు. బన్నీ వాసు సహ నిర్మాతగా వ్యవహరించారు.

సచేత్-పరంపర సంగీతం సమకూర్చగా.. అనిరుధ్ రవిచంద్రన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. అనిల్ మెహతా సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. 'జెర్సీ' సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటుగా రివ్యూలు పాజిటివ్ గా ఉన్నాయి. 'కేజీయఫ్ 2' నుంచి పోటీని తట్టుకొని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ళు రాబడుతుందో చూడాలి.