బాలీవుడ్ ఇండస్ట్రీలో బయోపిక్స్ అనేవి ఎప్పుడో మొదలయ్యాయి. ఇప్పటివరకు ఎన్నో బయోపిక్స్ ద్వారా లెజెండ్స్ లైఫ్ స్టోరీస్ తెరమీదకు తీసుకొచ్చారు మేకర్స్. అదేవిధంగా స్టార్ బ్యాట్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ లైఫ్ స్టోరీని కూడా బయోపిక్ రూపంలో తెరకెక్కించారు. నిజానికి గతేడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడి మొత్తానికి ఈ ఏడాది మార్చ్ 26న దేశవ్యాప్తంగా విడుదలైంది. కానీ సైనా రిలీజ్ సమయంలో థియేటర్స్ 50% అక్యూపెన్సీతో రన్ అవ్వడంతో సైనాకు కలెక్షన్స్ విషయంలో కాస్త దెబ్బపడిందనే చెప్పాలి. అయితే థియేట్రికల్ రిలీజ్ అయిన నెలలోపే సైనా మూవీ డిజిటల్ రిలీజ్ అవుతోంది. ఈరోజు నుండి సైనా బయోపిక్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ పరిణితి చోప్రా టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాను 'తారే జమీన్ పర్' ఫేమ్ అమోల్ గుప్తా తెరకెక్కించారు. థియేట్రికల్ రిలీజ్ అయినప్పటి నుండి సైనా పాత్రకు న్యాయం చేసిన పరిణితికు అటు సినీవర్గాల నుండి ఇటు ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో సైనా బ్యాట్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రలో మానవ్ కౌల్ నటించగా.. సైనా పార్టనర్ కం హస్బెండ్ పాత్రలో ఇషన్ నాక్వి నటించడం జరిగింది. మరి ఈ సూపర్ హిట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ డ్రామా సినిమాను థియేటర్స్ లో మిస్ అయినవారు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఇంట్లో కూర్చొని చూడవచ్చు. ప్రస్తుతం పరిణితి పలు బిగ్ మూవీస్ లో నటిస్తోంది.