తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ క‌పుల్ ఏంటిలా?

Update: 2022-09-02 04:05 GMT
రణబీర్ కపూర్ - అలియా భట్ ప్రస్తుతం వారి జీవితంలో అత్యుత్తమ దశల్లో ఉన్నారు. ఈ ఇద్దరు త్వరలో పేరెంట్ హుడ్ లోకి అడుగు పెట్టనున్నారు. కానీ అంతకు ముందు ఈ జంట‌ తమ సినిమా బ్రహ్మాస్త్ర విడుదల ప్ర‌చారంలో నిమ‌గ్న‌మై ఉంది. దీని కోసం నిండు గ‌ర్భిణి ఆలియా భ‌ట్ త‌న భ‌ర్త‌తో పాటు విమానాశ్ర‌యాల్లో వ‌రుస ప్ర‌యాణాలు చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ర‌ణబీర్ క‌పూర్- ఆలియా జంట‌గా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన `బ్ర‌హ్మాస్త్ర‌` సెప్టెంబర్ 9న విడుదల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకు నటీనటులు ఏ ఒక్క‌ అవ‌కాశాన్ని విడువ‌డం లేదు. ఈ రోజు కూడా రణబీర్- ఆలియాలు `బ్రహ్మాస్త్ర` ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు బయలుదేరినప్పుడు విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కారు.

ఈ ఫోటోల్లో అలియా భట్ బేబి బంప్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రంగురంగుల ప్రింట్లు ఉన్న అందమైన నల్లటి దుస్తులు ధరించింది ఆలియా. తన ముఖాన్ని మాస్క్ తో కప్పుకుని మేకప్ లేస్ గా క‌నిపించింది.

రణబీర్ కపూర్ ముదురు నీలం రంగు టీ- బ్లూ డెనిమ్  బ్లూ క్యాప్ తో క‌నిపించాడు. అతను తన భార్యామ‌ణితో క‌లిసి కెమెరాల‌కు ఫోజులిచ్చాడు. బ్ర‌హ్మాస్త్ర‌ చిత్రంలో మౌని రాయ్- అమితాబ్ బచ్చన్- నాగార్జున త‌దితరులు కూడా నటించారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ఆలియా భట్ త‌దుప‌రి హాలీవుడ్ లో `హార్ట్ ఆఫ్ స్టోన్` అనే చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గాల్ గాడోట్ -జామీ డోర్నన్ ప్రధాన పాత్రలో నటించనుండ‌గా ఆలియా కీల‌క పాత్ర పోషిస్తోంది. ప్రియాంక చోప్రా - కత్రినా కైఫ్ లతో ఫర్హాన్ అక్తర్ `జీ లే జరా` .. రణ్ వీర్ సింగ్ తో కలిసి కరణ్ జోహార్ `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ`లో కూడా న‌టిస్తోంది.

రణబీర్ కపూర్ నటించిన షంషేరా ఇటీవ‌లే విడుద‌లై ఫ్లాపైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం యానిమ‌ల్ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న క‌థానాయిక‌గా న‌టిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News