ప్రియుడి ఫొటోకు 'హాటీ' అంటూ స్టార్‌ డాటర్ కామెంట్‌

Update: 2021-05-25 14:30 GMT
బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్‌ కూతురు ఐరా ఖాన్‌ గత కొన్నాళ్లుగా సోషల్‌ మీడియాలో తెగ హడావుడి చేస్తున్న విషయం తెల్సిందే. ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ఆమె ప్రేమలో పడ్డట్లుగా కూడా వార్తలు వచ్చాయి. గతంలో కొన్ని సార్లు తన ప్రియుడి ఫొటోలను మరియు వీడియోలను కూడా షేర్‌ చేసింది. తన ప్రియుడితో దిగిన ఫొటోలు మరియు వీడియోలతో షేర్‌ చేసిన ఐరా ఖాన్‌ ఇప్పుడు మరో అడుగు అన్నట్లుగా నెట్టింట ప్రియుడి ఫొటోకు హాటీ అంటూ కామెంట్‌ పెట్టింది.

నూపూర్‌ షిఖరే తో ఐరా ఖాన్‌ ప్రేమలో ఉన్నట్లుగా బాలీవుడ్‌ మొత్తం తెలిసిన ఓపెన్‌ సీక్రెట్‌. వీరిద్దరు లాక్‌ డౌన్‌ టైమ్‌ లో ఫామ్‌ హౌస్‌ లో కలిసి ఉండి ఎంజాయ్‌ చేశారు అనేది ప్రముఖ బాలీవుడ్‌ మీడియా సంస్థల వాదన. ఆ విషయం పక్కన పెడితే ఇటీవల నూపర్‌ షిఖరే వర్కౌట్‌ ఫొటోను షేర్‌ చేశాడు. అందులో అతడి సిక్స్‌ ప్యాక్‌ కనిపించడంతో అందరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక ఆ ఫొటోకు అనూహ్యంగా ఐరా ఖాన్‌ 'వాట్‌ ఏ హాటీ' అంటూ కామెంట్ పెట్టింది. ఆమె కామెంట్‌ సోషల్‌ మీడియాలో అతడి ఫొటోను మరింత వైరల్‌ అయ్యేలా చేసింది.

ఐరా ఖాన్‌ గతంలో మిషాల్‌ తో ప్రేమాయణం సాగించింది. అతడితో విభేదాల కారణంగా బ్రేకప్ చెప్పి ప్రస్తుతం నూపూర్‌ తో డేటింగ్ లో ఉంది. ఈయనతో అయినా ఆమె జీవితంను పంచుకుంటుందా లేదంటే మద్యలోనే అతడితో కూడా బ్రేకప్‌ చెబుతుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఐరా ఖాన్‌ సోషల్‌ మీడియాలో ఆ కామెంట్‌ తో వైరల్‌ అవుతోంది.
Tags:    

Similar News