పుకార్లకు చెక్ పెట్టిన స్టార్ డైరెక్టర్..!

Update: 2021-04-21 09:30 GMT
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దాదాపు రెండేళ్లు వెయిట్ చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తదుపరి సినిమా చేయనున్నాడు. 2019లో విడుదలైన గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత హరీష్ నుండి మరే సినిమా రాలేదు. కేవలం పవన్ కళ్యాణ్ సినిమా పై మాత్రమే ఫోకస్ పెట్టాడని తెలిసిందే. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. సినిమా ఇంకా స్క్రిప్ట్ దశలో ఉండగానే సినిమా పై అంచనాలు ఓ రేంజిలో నెలకొన్నాయని సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ హవా చూస్తే అర్ధమవుతుంది. వకీల్ సాబ్ లాంటి సూపర్ హిట్ రీఎంట్రీ తర్వాత పవన్ సినిమాలకు చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు మేకర్స్.

ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' అనే హిస్టోరికల్ మూవీ చేస్తూనే.. మరోవైపు సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేసాక పవన్ హరీష్ శంకర్ తో సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు హరీష్ ను దర్శకుడిని చేసిన మాస్ మహారాజ్ రవితేజ స్క్రిప్ట్ పై కూడా వర్క్ చేస్తున్నట్లు టాక్. ఈ విషయం పై స్పందించిన హరీష్ సన్నిహితులు ఈ పుకార్లను కొట్టిపాడేసారు. హరీష్ ప్రస్తుతం కేవలం పవన్ కళ్యాణ్ సినిమా స్క్రిప్ట్ పై మాత్రమే వర్క్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఈ మాస్ డైరెక్టర్ పవన్ తో ఎలాంటి సినిమా చేయనున్నాడో!
Tags:    

Similar News