ఆయన ఒక స్టార్ దర్శకుడు. తనకంటూ ప్రత్యేకంగా అభిమానులు ఉన్న ప్రతిభాశాలి. అయితే తన సినిమాలలో ఏదో ఒక ప్రేరణ కనిపిస్తూ ఉంటుంది. ఒక సినిమాను అయితే పూర్తి ప్రేరణతోనే తెరకెక్కించారు. దీన్ని స్టైల్ గా ఫ్రీమేక్ అని ఈ సోషల్ మీడియా జనాలు పిలుస్తుంటారు. ఇది తెలిసినప్పటికీ అభిమానులు మాత్రం పెద్దగా పట్టించుకోరు. అయన డిమాండ్ ఇసుమంతైనా తగ్గదు.
అయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో పెద్ద స్టార్ హీరో నటిస్తున్నారు. సినిమాపై క్రేజ్ కూడా పీక్స్ లోనే ఉంది. అయితే ఈ సినిమా ఒక పాత తెలుగు క్లాసిక్ కు ఫ్రీమేక్ అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆ సినిమా పేరేంటో కూడా ప్రేక్షకుల్లో దాదాపుగా అందరికీ తెలుసు. ఇప్పటివరకూ జస్ట్ స్టొరీ లైన్ మాత్రం ప్రేరణ అనుకున్నారు కానీ స్వల్ప మార్పులు తప్ప ఆ సినిమాను యాజిటీజ్ దించేస్తున్నాడని ఫిలిం సిర్కిల్స్ లో చెవులు కొరుక్కుంటున్నారు.
అంతే కాదు ఈ ఫ్రీమేక్ పధ్ధతి ఆయనకు తెగ నచ్చిందట. కొత్త సబ్జెక్టులు వండడం.. జనాలకు నచ్చుతుందా నచ్చదా అని టెన్షన్ పడడం ఎందుకు? ఏదో ఒక పాత క్లాసిక్ ను తీసుకుని దానికి ఈ జెనరేషన్ టచ్ ఇచ్చి హైఫై గా తీస్తే సరిపోతుందని డిసైడ్ అయ్యాడట. ఫ్యూచర్ లో కూడా 'ఆ విధంగా ముందుకుపోతాడట'. అయితే ఈ దర్శకుడి పద్ధతి ఆయనతో చాలాకాలంగా ప్రయాణం చేస్తున్న సన్నిహితుడైన నిర్మాతకు మింగుడు పడడంలేదట. స్టార్ డైరెక్టర్ అయితే కావచ్చు కానీ ఆ దర్శకుడి చేష్టలు భరించే ఓపిక పూర్తిగా పోయిందని నిర్మాత బాధపడుతున్నట్టు ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంత ప్రతిభ ఉన్నా ఈ కాపీ పేస్ట్ పనులతో ఆ దర్శకుడు తన స్థాయిని తనే తగ్గించుకుంటున్నాడని కొందరు అభిమానులు కూడా వాపోతున్నారు.