ఇండస్ట్రీలో ఏ కాంబినేషన్ ఎప్పుడు సెట్టవుతుందో.. ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఎవరూ ఊహించలేరు. కాదనుకున్న ప్రాజెక్ట్ పట్టాలెక్కొచ్చు.. అవుతుందనుకున్నది పక్కు వెళ్లోచ్చు. ఇది ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరుగుతున్నదే. అయితే ఇలా పట్టాలెక్కుతుందని గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న ఓ ప్రాజెక్ట్ విషయంలో స్టార్ డైరెక్టర్ ఓపిక పీక్స్ చేరినట్టుగా తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించినా ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ గురించి మేకర్స్ కానీ, హీరో కానీ ప్రకటించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అదే స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ క్రేజీ ప్రాజెక్ట్ 'భవదీయుడు భగత్ సింగ్'. ఈ ప్రాజెక్ట్ ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో చేయాలని హరీష్ శంకర్ ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మించాలనుకున్నారు. అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించిన నెలలు గడుస్తున్నా ఇప్పటికీ దీని ఊసే ఎక్కడా ఎత్తడం లేదు. ఈ ప్రాజెక్ట్ తరువాత ప్రకటించిన 'వకీల్ సాబ్' సెట్స్ పైకి వెళ్లింది.. రిలీజ్ అయింది కూడా. ఆ తరువాత 'భీమ్లానాయక్' కూడా ఇదే తరహాలో చక చకా పూర్తయి ప్రేక్షకుల ముందుకు వచ్చేసి హిట్ అనిపించుకుంది.
అయినా 'భవదీయుడు భగత్ సింగ్' ఊసే లేదు. ఇప్పడు కొత్తగా పవన్ కల్యాణ్ తమిళంలో సముద్రఖని నటించి తెరకెక్కించిన 'వినోధాయ సితం'ని కూడా ప్రకటించి త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. దీని తరువాత విజయ్ నటించిన 'పోలీసోడు' ఆధారంగా 'సాహో' ఫేమ్ సుజీత్ డైరెక్షన్ లో రీమేక్ చేయబోతున్నారు. ఇన్ని జరుగుతున్నా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ క్రేజీ ప్రాజెక్ట్ 'భవదీయుడు భగత్ సింగ్' మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు.
దీంతో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ అసహనానికి గురయ్యే అవకాశాలు వున్నాయని ఇన్ సైడ్ టాక్. ఇటీవల పవన్ ఫ్యాన్స్ 'భవదీయుడు భగత్ సింగ్' ఉంటుందా? వుండదా? ఈ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇవ్వమని అడిగితే 'కొన్ని సార్లు రావడం లేటవ్వొచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా' అంటూ క్లారిటీ ఇచ్చాడు.
అయితే ఈ ప్రాజెక్ట్ పై మేకర్స్ నుంచి కానీ, హీరో పవన్ కల్యాణ్ నుంచి కానీ ఇంత వరకు క్లారిటీ రాకపోవడంతో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సహనాన్ని ఓ విధంగా పరీక్షిస్తున్నారనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
హరీష్ శంకర్ ఒరిజినల్ కథతో వస్తే పవన్ మాత్రం రీమేక్ ల వెంట పడుతుండటం ఏమీ బాగాలేదని కొంత మంది వాపోతున్నారట. 'గబ్బర్ సింగ్ ' లాంటి బ్లాక్ బస్టర్ ని ఎన్నో ఏళ్ల తరువాత పవన్ కు అందించిన దర్శకుడిని ఇలా వేయిట్ చేయించడం తగునా? అని కూడా కొంత మంది కామెంట్ లు చేస్తున్నారు. ఇంకా లేట్ చేస్తే స్టార్ డైరెక్టర్ ఓపిక పీక్స్ కు చేరి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని మరో హీరోని చూసుకునే ప్రమాదం వుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.