దిక్కుతోచ‌ని స్థితిలో స్టార్ డైరెక్ట‌ర్?

Update: 2022-06-24 07:35 GMT
స్టార్ హీరోకు కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించాడో స్టార్ డైరెక్ట‌ర్‌. ఆ సినిమా స‌ద‌రు స్టార్ హీరో కెరీర్ కు భారీ రిలీఫ్ ని అందించి మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేలా చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. స్టార్ హీరో ఫ్యాన్స్ కు డైరెక్ట‌ర్ ని మ‌రింత ద‌గ్గ‌ర చేసింది. ఇక ఈ మూవీ త‌రువాత కొన్నేళ్ల విరామం తీసుకున్న ఈ కాంబినేష‌న్ లో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ ని గ‌తేడాది ప్ర‌క‌టించారు. మేక‌ర్స్, స్టార్ డైరెక్ట‌ర్ ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచ‌నాలు పెట్టుకోవ‌డ‌మే కాకుండా ఫుల్ జోష్ తో క‌నిపించారు.

క‌ట్ చేస్తే ఏడాది గ‌డుస్తున్నా స్టార్ హీరోతో ప్ర‌క‌టించిన క్రేజీ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌డం లేదు. కార‌ణం స్టార్ హీరో ఇప్ప‌టికే అంగీక‌రించిన సినిమాల షూటింగ్ లు న‌త్త‌న‌డ‌క‌న న‌డుస్తుండ‌టం.. అక్టోబ‌ర్ త‌రువాత స‌ద‌రు స్టార్ హీరో సినిమాల‌కు బ్రేక్ ఇవ్వ‌బోతుండ‌టం స్టార్ డైరెక్ట‌ర్ కు సంక‌టంగా మారింది.

ఆ హీరోని కాద‌ని ముందుకు వెళ్ల‌లేడు.. వెళ్ల‌లేని ప‌రిస్థితి త‌న‌ది. అలా అని మ‌రో హీరో డేట్స్ కేటాయించ‌లేని స్థితి. ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కుతుంద‌ని ఆశ‌గా గ‌త రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా స్టార్ డైరెక్ట‌ర్ కు చేదు అనుభ‌వమే ఎదుర‌వుతూ వ‌చ్చింది.

ఫైన‌ల్ గా ఇప్పుడైనా ప‌ట్టాలెక్కిద్దామ‌ని అంతా రెడీ చేసుకుంటే స్టార్ హీరో అందుకు సిద్ధంగా లేక‌పోవ‌డం.. అక్టోబ‌ర్ త‌రువాత మ‌రింత‌గా అందుబాటులో వుండ‌డ‌ని తెలియ‌డంతో స్టార్ డైరెక్ట‌ర్ ప‌రిస్థితి మ‌రింత గంద‌ర‌గోళంగా మారిందట‌. ఈ ప్రాజెక్ట్ కోస‌మే ఇంకా వేచి వుండాలా? .. లేక వేరే హీరో కోసం మ‌రో ప్రాజెక్ట్ కు వెళ్లిపోవాలా? అన్న‌ది అర్థం కాని దిక్క‌తోచ‌ని స్థితిలో వున్నార‌ట‌. పోనీ స్టార్ హీరో అందుబాటులోకి రావ‌డం లేద‌ని ఈ ప్రాజెక్ట్ ని ప‌క్క‌న పెట్టి మ‌రో స్టార్ హీరో కోసం వెళ‌దామ‌న్నా ఎవ‌రూ ఖాలీగా లేరు.

ప్ర‌తీ హీరో వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీగా వున్నారు. కొంత మంది ఆల్ రెడీ సెట్ట‌యిన ప్రాజెక్ట్ ల‌ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి రెడీ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో స్టార్ డైరెక్ట‌ర్ కు తాను అనుకున్న స్టార్ హీరో ల‌భించ‌డం క‌ష్టంగా మారింది. ప్ర‌స్తుతం ఆయ‌న ముందున్న ఏకైక ఆప్ష‌న్ స్టార్ హీరోల కోసం వెళ్ల‌కుండా టైర్ టు హీరోల‌లో ఎవ‌రో ఒక‌రిని ఫైన‌ల్ చేసుకుని త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ కు వెళ్లిపోవ‌డ‌మే అని అంతా అంటున్నారు. త‌ను కూడా ఇదే ఆలోచ‌న‌లో వున్నాడు కూడా. త్వ‌ర‌లోనే త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించి షాకివ్వ‌డానికి స్టార్ డైరెక్ట‌ర్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్టుగా తెలుస్తోంది.

ప్ర‌స్తుతం స్టార్ హీరోతో అనుకున్న ప్రాజెక్ట్ ని ప‌క్క‌న పెట్టి వ‌రుణ్ తేజ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్‌, రామ్‌, ర‌వితేజ వంటి హీరోల‌తో వెళ్ల‌డం మంచిద‌ని చెబుతున్నారు. అయితే స‌ద‌రు స్టార్ డైరెక్ట‌ర్ ప్లాన్ మ‌రోలా వుంది. తెలుగు హీరోల‌తో కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోతో త‌న నెక్స్ట్ మూవీకి శ్రీ‌కారం చుట్టాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే బాలీవుడ్ హీరోని క‌లిసి లైన్ వినిపించిన స‌ద‌రు స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌స్తుతం ఆ స్క్రిప్ట్  ని పూర్తి చేసే ప‌నిలో వున్నార‌ట‌. అన్నీ కుదిరితే బాలీవుడ్ స్టార్ హీరోతో త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News